38.3 C
India
Sunday, May 5, 2024
More

    Hombale Films : కేజీఎఫ్, సలార్ ప్రొడక్షన్ హౌజ్ ‘హోంబలే ఫిల్మ్స్’ గురించి తెలుసా?

    Date:

    • ఆ రెండు సినిమాలు ఫ్లాపే ఇన్ని హిట్లకు కారణం!
    Hombale Films
    Hombale Films

    Hombale Films : సినిమా హిట్టయినా.. ఫట్టయినా.. దర్శకుడు, హీరోలకే ఆ క్రెడిట్ దక్కుతుంది. కానీ నిర్మాణ సంస్థలను పట్టించుకోవడం చాలా అరుదు. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు ప్రొడక్షన్ హౌజ్ ల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల రిలీజైన ‘సలార్’ ఒక్క రోజుతోనే బాక్సాఫీస్ సక్సెస్ టాక్ రావడంతో నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ గురించి మాట్లాడుతున్నారు. కేజీఎఫ్, కాంతారా సినిమాలు కూడా ఈ ఫిల్మ్ హౌజ్ నుంచి వచ్చినవే. హోంబలే ఫిల్మ్ హౌజ్ ఎక్కడుంది..? దాని అధినేతలు ఎవరు..? ఆ పేరు ఎలా వచ్చింది..? అనే దాని గురించి తెలుసుకుందాం.

    హోంబలే మీనింగ్..
    కర్ణాటకకు చెందిన విజయ్ కిరంగదూర్, కార్తీక్‌ గౌడ, చలువే గౌడకు సినిమాలపై ఉన్న ఆసక్తే ‘హోంబలే ఫిల్మ్స్‌’ పెట్టేందుకు కారణమైంది. వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు విజయ్‌ కిరంగదూర్‌ మాండ్య నుంచి బెంగళూర్ కు వచ్చాడు. అదే సమయంలో కార్తీక్‌ కూడా సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. ఈ కజిన్స్‌కు సినిమాలపై ప్రేమ పోలేదు. ఎలాగైనా సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలని అనుకున్నారు. 2013లో ‘హోంబలే ఫిల్మ్స్‌’ అని ప్రారంభించారు. కిరంగదూర్‌, చలువే గౌడ అధినేతలుగా ఉండగా కార్తీక్‌ గౌడ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక తమ ఇలవేల్పు హోంబలమ్మ పేరు మీద నిర్మాణ సంస్థకు ‘హోంబలే ఫిల్మ్స్‌’ అని పేరు పెట్టారు.

    తొలి ప్రయత్నంలో చేదు అనుభవం
    కావాల్సినంత డబ్బు, ఇంట్రస్ట్ ఉన్నంత మాత్రాన విజయం వరించదు. సినిమాలపై అవగాహన కూడా కావాలి. అవగాహన లేమితో కొత్తలో పరాజయాలు వరించాయి. కొత్త దర్శకులు, నిర్మాతలకు ప్రోత్సాహం ఇచ్చే పునీత్ రాజ్ కుమార్ తో ‘నిన్నిందలే’ మూవీ తీశారు. 2014లో రిలీజ్ చేయగా ఇది తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. తమ వద్ద ఉన్న డబ్బును ముగ్గురు పోగొట్టుకున్నారు. అయినా వెనుకడుగు వేయలేదు. ‘నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టాలనే కాదు.. కథను కూడా పట్టించుకోవాలి’ ఇలా ఒక కథను ఎన్నుకున్నారు. అదే ‘మాస్టర్ పీస్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో యష్ హీరోగా చేశాడు. ఈ మూవీతోనే యష్ హోంబలేతో టచ్ లోకి వెళ్లాడు. 2015 లో రిలీజైన ఈ మూవే హోంబలే పేరును ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ చిత్రం సుమారు రూ. 35 కోట్లను వసూలు చేసింది.

    పునీత్‌తో మరోసారి..
    పునీత్ రాజ్ కుమార్ తో తొలి ప్రయత్నంలో దెబ్బతిన్న నిర్మాతలు.. ఆయనతో మారో సినిమా చేశారు. అదే ‘రాజకుమార’. 2017, మార్చిలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. కన్నడ పరిశ్రమ (శాండల్ వుడ్)లో అత్యధిక వసూళ్లు (సుమారు రూ. 76 కోట్లు: గ్రాస్‌) రాబట్టిన 6వ సినిమాగా నిలిచింది. మల్టీప్లెక్స్‌ల్లో ఆరు వారాల్లో 6 వేల షోస్‌ ప్రదర్శితమైన తొలి కన్నడ చిత్రంగా రికార్డులను తిరగరాసింది.

    సంచలనం రేపిన కేజీయఫ్‌..
    మూడు చిత్రాల తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 చేశారు.
    యష్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా గురించి ఇండియా వ్యాప్తంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ మాతృకలో వచ్చిన కేజీఎఫ్ దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసుకొని వచ్చింది. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ‘కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌’ రూ. 250 కోట్లను కలెక్ట్‌ చేసింది. ఒక కన్నడ సినిమా ఇన్ని కోట్లు రాబట్టిందంటే బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఈ ఒక్క చిత్రం హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ కెరీర్‌ను మార్చేసింది. 2018, డిసెంబర్ వరకు కన్నడనాటకే పరిమితమైన వారి పేర్ల కోలార్ గోల్డ్ మైన్ జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. కంటెంట్‌ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమా హిట్‌ చేస్తారనడానికి ‘కేజీయఫ్‌’ చక్కటి నిదర్శనం.

    విజయం దక్కితే బాధ్యత పెరుగుతుంది, ఒత్తిడి కూడా పెరుగుతుంది. వీటిని అధిగమించి ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’ (సుమారు రూ. 1250 కోట్లు)తో తన మార్క్‌ చూపించింది హోంబలే. ఈ భారీ ప్రాజెక్టుకు ముందు ఈ సంస్థ పునీత్‌ రాజ్‌కుమార్‌తో ‘యువరత్న’ అనే సినిమా చేసింది. 2021లో విడుదలైన ఈ చిత్రానికి ప్రశంసలు దక్కాయి.

    చిన్న చిత్రం.. పెద్ద విజయం
    కేజీఎఫ్ 1, 2 తర్వాత ‘కాంతార’ను కూడా నిర్మించింది ‘హోంబలే ఫిల్మ్స్‌’. కేవలం కన్నడకే పరిమితం చేద్దామనుకుని సినిమా చేస్తే అది ఊహించని రీతిలో అభిమానులను థియేటర్లకు రప్పించింది. దీంతో డబ్ చేసి వివిధ భాషల్లో వదలగా మరింత ఆదరణ పెరిగింది. కర్ణాటకలోని తమిళుల సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంను కథాంశంగా తీసుకొని రూ. 16 కోట్లతో చేసిన సినిమా సుమారు రూ. 390 కోట్లు వసూళ్లు రాబట్టి.. కన్నడ ఇండస్ట్రీ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేసింది.

    ఇప్పుడు ‘సలార్‌’..
    కాంతార తర్వాత హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ చిత్రానికి తెర లేపింది. కేజీఎఫ్ ను ఇచ్చిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ ను హీరోగా పెట్టి ‘సలార్’ చేసింది. ఈ సినిమా పూర్తయ్యేలోగా మధ్య మధ్యలో ‘రాఘవేంద్ర స్టోరీస్‌’, ‘ధూమమ్‌’ (మలయాళం) రిలీజ్ చేసింది. వీటికి కూడా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఓ వైపు చిన్న సినిమాలు నిర్మిస్తూనే పాన్ ఇండియా మూవీస్ ను కూడా నిర్మించింది. ‘ఇన్నేళ్లకు ప్రభాస్ కటౌట్ కు తగ్గ సినిమా’ అంటూ అభిమానులు సంబురాలు చేసుకున్నారు.

    హోంబలే నెక్ట్స్ ప్రాజెక్ట్స్
    యువ, భగీర, కాంతార ఛాప్టర్‌ 1, రిచర్డ్‌ ఆంథోనీ, రఘుతాత (తమిళ్), టైసన్‌ (మలయాళం) ప్రాజెక్టులు చేయనున్నాయి.

    పరాజయం నేర్పిన పాఠాలు
    ‘మేం కథను ఎంచుకుంటే దాన్ని ప్రేక్షకుల కోణంలో చర్చిస్తాం.. ఎలాంటి అంశాలు ఉంటే ఆడియన్స్ కు నచ్చుతుంది. కొత్తగా ఏం చూపించాలి’ అని పరిశీలిస్తాం. మరోసారి ఫెయిల్యూర్‌ రావద్దని గతంలోనే నిశ్చయించుకున్నాం. ఓ ప్లానింగ్‌ ప్రకారం ముందుకెళ్తున్నాం. వీధి నాటకాలు, హరికథలు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఆ నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించాలనుకుంటున్నాం’ అని నిర్మాతలు ఓ సందర్భంలో తెలిపారు.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    Rama Prabha : రమాప్రభ ఎవర్ గ్రీన్

    Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Yash : నిర్మాతగా మారిన యష్.. దేశంలోనే భారీ ప్రాజెక్టుతో..

    Hero Yash : కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ ప్రొడ్యూసర్...

    USA Box Office : యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ రెండు సినిమాలు..

    USA Box Office : గత వారాంతం (2023 లాస్ట్)లో రిలీజైన...

    Prabhas Salaar : రాజమౌళి.. ‘డైనోసర్’ ఏమైంది..?  నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

    Prabhas Salaar : డార్లింగ్ ప్రభాస్ ‘సలార్’ విడుదలై.. పాజిటివ్ టాక్...