
uric acid : మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కిడ్నీల పనితీరు మందగించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడంతో ఇబ్బందులు ఏర్పడతాయి. యారిక్ యాసిడ్ పెరగడానికి కారణం కిడ్నీలు దెబ్బతినడమే అనే సంకేతాలు వస్తుంటాయి. దీంతో యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవలనే దానిపై ఫోకస్ పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
పైనాపిల్ జ్యూస్ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే నొప్పి, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే పైనాపిల్ జ్యూస్ రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయట పడొచ్చు. ప్రతిరోజు ఉదయం పూట క్యారెట్ జ్యూస్ తాగితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కీర దోస కూడా సాయపడుతుంది. ఇరవై రోజులపాటు రెగ్యులర్ గా దీని జ్యూస్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య దూరమవుతుంది.
చెర్రీస్ పండ్ల జ్యూస్ తాగడంతో కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. అల్లం ఉడికించి అందులో తేనె కలుపుకుని తాగితే కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్ లోకి వస్తాయి. పైనాపిల్ జ్యూస్ లో పసుపు, అల్లం కలుపుకుని తాగితే యూరిక్ యాసిడ్ సమస్య రాదు.