Donation & Results :
మన హిందూ మతంలో దానం చేయాలని చెబుతుంటారు. ఏ మతంలోనైనా దానగుణమే ప్రధానంగా భావిస్తుంటారు. ఈనేపథ్యంలో వేటిని దానం చేయాలి? వేటిని చేయకూడదో తెలుసుకోవాలి. అపాత్ర దానం చేయడం మంచిది కాదని అంటుంటారు. దానం చేయడంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. అవేంటో సరిగా తెలుసుకోకపోతే ఇబ్బందులు రావడం సహజం.
మనం ఇంటిని శుభ్రం చేసేది చీపురు. దీన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. చీపురును దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. దీంతో పొరపాటున కూడా చీపురును దానం చేయడం మంచిది కాదని తెలుసుకోవాలి. దీంతో మనం ఎప్పుడు కూడా చీపురును దానం చేయడానికి సుముఖత చూపకూడదు. అది కొత్తదైనా పాతదైనా చీపురును దానం చేయడం అంత సురక్షితం కాదు.
కత్తి, కత్తెర, సూది వంటి పదునైన వస్తువులు కూడా ఎప్పుడు దానం చేయవద్దు. దీని వల్ల ఇంట్లో అసమ్మతి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఏర్పడవచ్చు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయవద్దు. వీటిని దానం చేస్తే మన ఇంటికి అరిష్టం పడుతుంది.
తైలం దానం చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. కానీ మనం దానం చేసే నూనె మంచిదై ఉండాలి. ఇదివరకు వాడిన నూనెను దానం చేయకూడదు. ఇలా చేస్తే శని దేవుడి చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది శనిని ప్రసన్నం చేసుకోవాలంటే నువ్వులు లేదా ఆవాల నూనె దానం చేయడం శ్రేయస్కరం. ఇలా మంచి నూనెను దానం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి.
ఆకలితో ఉన్న వాడికి ఆహారం దానం చేయడం మంచిదే. కానీ ఆ ఆహారం కూడా పాడు కానిది అయి ఉండాలి. చెడిపోయిన ఆహారం దానం చేస్తే పాపం మూటకట్టుకున్నట్లే. జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ప్లాస్టిక్ వస్తువులు దానం చేయకూడదు. గాజు, అల్యూమినియం, స్టీల్ వస్తువులు కూడా దానం చేయడం వల్ల మనకు నష్టాలే వస్తాయి.