Ramcharan- Anushka 2009లో వచ్చిన మగధీర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రాంచరణ్ జీవితంలోనే మంచి హిట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో కాజల్ కు మంచి గుర్తింపు లభించింది. ఇక తిరిగి చూసుకోలేదు. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన సినిమాగా రికార్డులు కొల్లగొట్టింది. రాంచరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మగధీర ఎంతో ఖ్యాతి సాధించింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అనుష్కను అనుకున్నారట. కానీ ఆమె ఒప్పుకోలేదట. రాంచరణ్ కంటే అనుష్క ఎత్తుగా ఉండటంతో తను తమ్ముడిగా ఉంటాడని రిజెక్ట్ చేసిందట. అందుకే రాజమౌళి కాజల్ ను తీసుకున్నాడట. అందుకే కాజల్ కు అవకాశం దొరికిందట. ఇక అప్పటి నుంచి కాజల్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో సినిమా పరిశ్రమలో మంచి పొజిషన్ కు చేరుకుంది.
కాజల్ అగర్వాల్ కు మగధీర మొదటి మెట్టుగా మారింది. తరువాత కాలంలో ఆమె బిగ్గెస్ట్ హీరోయిన్ గా అయింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రొఫెషనల్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. కాజల్ లక్ష్మీ కల్యాణంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన కాజల్ ఇక వెనుదిరిగి చూడలేదు. ఎన్నో చిత్రాలు హిట్ గా నిలిచాయి.
ఇలా కాజల్ పెళ్లి చేసుకున్నాక సినిమాలకు టాటా చెప్పింది. సంసారంలో తలమునకలైంది. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లయింది. ఈ నేపథ్యంలో కాజల్ కు మగధీర మంచి గుర్తింపు తీసుకొచ్చింది. రాంచరణ్ తో పాటు కాజల్ కు మగధీర ఓ బ్రహ్మాండమైన హిట్ ఇచ్చింది. తెలుగు పరిశ్రమను ఊపేసింది. రాంచరణ్ తో నటిస్తే అనుష్కకు మంచి హిట్ దక్కేది. కానీ ఆ అవకాశాన్ని అనుష్క మిస్ చేసుకుంది.