Dr. Vasanth Vijay Ji Maharaj : దక్షిణ భారత దేశంలోని క్రిష్ణగిరికి చెందిన ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త డా. వసంత్ విజయ్ జీ మహరాజ్ శాంతిప్రదాతనే కాదు ఆయన విశ్వ సోదరుడు, ప్రేమ, ఐక్యతలకు దూత కూడా. ప్రపంచంలోని వివిధ సమస్యలకు పరిష్కారం చూపడం, దేశాల మధ్య ప్రేమ, సోదర భావాన్ని పెంచడమే ఆయన దృక్పథమని చెప్పవచ్చు.
అమెరికాలోని ఓక్ ట్రీ, ఎడిసన్ స్టేట్ లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో ఫిబ్రవరి 22న సాయంత్రం 6.30 గంటలకు వసంత్ విజయ్ జీ మహరాజ్ ‘‘గురుశక్తి, వ్యక్తి జీవితంలో గురువు పాత్ర’’పై అద్భుత ప్రసంగం చేయనున్నారు.
2005లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీస్ మార్చ్(శాంతి యాత్ర)ను భారత్ లోని వేలాది మంది విద్యార్థులతో కలిసి వసంత్ విజయ్ జీ మహరాజ్ నిర్వహించారు. జాతి పట్ల ఆయన విశాల సేవాదృక్పథానికి 2009లో అంతర్జాతీయ పార్లమెంట్ ఆయన్ను భారత దౌత్య కౌన్సిలర్ గా నియమించింది.
2011లో వసంత్ విజయ్ జీ మహరాజ్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం విశేషం. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన సేవలకు గానూ ఎన్నో ప్రశంసలు దక్కాయి. 2014లో బ్రిటన్ ఆయుర్వేద కౌన్సిల్ వసంత్ విజయ్ జీ మహరాజ్ కు ‘‘ఆయుర్వేద రత్న’’ ప్రకటించడం గమనార్హం.
All Images Courtesy by Dr. Shiva Kumar Anand
More Pics : Dr. Vasanth Vijay Ji Maharaj Guru Speech at SDP SSV Temple PHOTOS