
Eating rice : ఈ రోజుల్లో అన్నం తింటే అనర్థాలని చెబుతున్నారు. దీంతో చాలా మంది అన్నం మానేస్తున్నారు. దానికి బదులు ఇతర పదార్థాలు తీసుకుంటున్నారు. అన్నం తినడం వల్ల బీపీ, షుగర్ వంటి రోగాలు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల అన్నం తినాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నం తింటే రోగాలు వస్తాయనేదానికి శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు.
మన పూర్వీకులు అన్నం తిని బతకలేదా? మనకెందుకు అన్నం వద్దు అనే ప్రశ్నలు వస్తున్నాయి. వైట్ ప్రొడక్ల్స్ మంచివి కావనే ప్రచారం పెరిగింది. అన్నం తింటే లావు అవుతారని చెబుతున్నారు. అంటే రోజు కూలి పనిచేసే వారు మనకంటే ఎన్నో రెట్లు అన్నం తింటారు. కానీ వారు బరువు పెరగరు. అంటే మనం ఏ పని చేయకపోవడం వల్లే బరువు పెరుగుతున్నాం. కానీ అన్నం తినడం వల్ల కాదు.
గోధుమ పిండిలో గ్లూటెన్ ఉంటుంది. కానీ అన్నంలో అలాంటివి ఏమి ఉండవు. కార్బోహైడ్రేడ్లు మాత్రమే ఉంటాయి. దీంతో అన్నం తినడం వల్ల మనకు ఎలాంటి ముప్పు ఉండదు. బియ్యం కూడా ఆరోగ్యకరమైన ఆహారమే. దీంతో రోజు అన్నం తిన్నా ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ విషయంలో ఎవరో చెప్పేదాన్ని విశ్వసించడం మంచిది కాదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
వేడి అన్నం కాకుండా కాస్త చల్లారిన తరువాత తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. వేడి అన్నంలో చికెన్ వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా మంచి రుచిగా ఉంటుంది. ఇలా ఎలాంటి అనుమానాలు లేకుండా అన్నం మూడు పూటలు తినడం వల్ల మనకు లాభమే కాని నష్టాలు రావని పలువురు చెబుతున్నారు.