
Eating salt is harmful to our health : ఉప్పు తినడం వల్ల మనకు ముప్పే. దీంతో ఉప్పు వాడకం మానేయాలి. వైట్ ప్రొడక్ట్స్ తో మనకు ఎన్నో నష్టాలు వస్తాయి. శరీర అవయవాలు దెబ్బతినడానికి ఉప్పే కారణం. మోకాళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు తదితర సమస్యలు రాడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పును దూరం చేసుకోవడమే ఉత్తమం. లేదంటే మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.
ఉప్పుతో గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది. రక్తనాళాల్లో ఉప్పు పేరుకుపోవడం వల్ల మన గుండె పనితీరు మందగిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు వేధిస్తుంటాయి. ఈ క్రమంలో గుండె సంబంధ రోగాలు రావడానికి ఉప్పే ప్రధాన కారణం. గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవాలంటే ఉప్పును పూర్తిగా విడిచిపెట్టాల్సిందే. లేదంటే ఇబ్బందులే.
ఉప్పు వాడకం వల్ల కిడ్నీలుదెబ్బ తింటాయి. మూత్ర పిండాల పనితీరు మందగించడానికి ఉప్పే కారణం. దీని వల్ల రక్తసరఫరాపై ప్రభావం పడుతుంది. పక్షవాతం రావడానికి అవకాశం ఉంటుంది. మెదడుకు సరఫరా అయ్యే రక్తంలో ఆటంకాలు ఏర్పడటంతో రక్తనాళాలు చిట్టిపోతాయి. దీంతో పక్షావాతం సమస్య వస్తుంది. ఉప్పును వాడకుండా ఉంటే మనకు చాలా నష్టాలు ఉంటాయి.
ఒక మనిషి రోజుకు ఐదు గ్రాముల వరకు ఉప్పు తీసుకోవచ్చు. కానీ మనం రోజుకు దాదాపు పది గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాం. దీంతో ఇదంతా మన శరీర భాగాల్లో పేరుకుపోతుంది. దీంతో అవి దెబ్బతినడానికి అవకాశం ఉంటోంది. దీని వల్ల మనకు రోగాల ముప్పు వస్తోంది. ఉప్పును పూర్తిగా దూరం చేస్తే మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.