Elon Musk ప్రపంచ కుబేరులు, డిఫరెంట్ ఐడియాలజీ ప్రకారం చూసుకుంటే ఎలన్ మస్క్ మొదటి వరుసలో నిలుస్తారు. ‘టెస్లా’ను రూపొందించేందుకు ఆయన ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు. ఆ తర్వాత ఒక సమయంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా స్థానం సంపాదించాడు. ట్విటర్ లో దాదాపు 70 శాతం షేర్ పెట్టిన ఆయన చివరకు పూర్తి స్థాయిలో ట్విటర్ ను స్వాధీనం చేసుకున్నాడు.
ఇప్పుడు ఆయన కన్ను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ AIపై పడింది. ప్రస్తుతం ప్రపంచాన్ని AI శాసించనుంది. జన వాసాల్లోకి ఏఐ వేగంగా దూసుకువస్తుంది. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో ప్రజలు ప్రతీ అంశంపై అవగాహనను పెంచుకుంటున్నారు. దీనికి AIకూడా తోడైతే ఫలితాలు మరింత వేగంగా ఉంటాయని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో చేసిన తన ప్రకటనను కొనసాగిస్తూ, ఎలోన్ మస్క్ తన కొత్త AI కంపెనీ ‘X.AI Corp’ని ప్రారంభించాడు. ‘విశ్వం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే గరిష్ట సత్యాన్వేషణ AI’ కోసం తాను ఒక వెంచర్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు మస్క్ గతంలోనే చెప్పాడు. ఎలన్ మస్క్ తన AI కంపెనీ గురించి వివరాలను వెల్లడించకుండా, ‘రియాలిటీని అర్థం చేసుకోవడానికి @xAI ఏర్పాటు చేస్తున్నాడు ప్రకటిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.
కంపెనీ ఏర్పాటుకు ఒక సమయం గడువు అంటూ ఇవ్వలేదు. కానీ శుక్రవారం (జూలై 14) ట్విటర్ స్పేస్ చాట్‌ను హోస్ట్ చేస్తుందని కంపెనీ వెబ్‌పేజీ ద్వారా పేర్కొంది. మస్క్ కొత్త కంపెనీ ట్విటర్-సంబంధిత AI ప్రాజెక్ట్ కోసం ఈ సంవత్సరం ప్రారంభంలో వేలాది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (GPU)ను కొనుగోలు చేసినట్లు తెలసింది. X.AI ఆ ప్రాజెక్ట్ కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.
ఎలన్ మస్క్ తన X.AIతో ఓపెన్ AI చాట్ జీపీటీ, Google బార్డ్‌ను సవాలు చేసేందుకు X.AIని ప్రారంభించినట్లు తెలుస్తోంది. X.AI టీమ్‌కు ఎలోన్ మస్క్ నాయకత్వం వహిస్తున్నారు. OpenAI, గూగుల్ రీసెర్చ్, మైక్రోసాఫ్ట రీసెర్చ్, డీప్‌మైండ్ వంటి ఇతర AI దిగ్గజాల్లో పనిచేసిన బృంద సభ్యులు కూడా ఈ టీమ్ లో ఉన్నారు.
Announcing formation of @xAI to understand reality
— Elon Musk (@elonmusk) July 12, 2023