Kangana Ranaut బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు కంగనా రనౌత్.. అమ్మడు ఎప్పుడు ఎవరి మీద విరుచుకు పడుతుందో చెప్పడం కష్టమే.. ఈమె స్టార్ హీరోలను సైతం లెక్కచేయకుండా ఏకిపారేయడం తన నైజం.. ఇక తాజాగా బాలీవుడ్ లో ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.
కంగనా రనౌత్ కరణ్ జోహార్ మీద సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేసింది.. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది.. అమ్మడు కరణ్ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా ఇటీవలే బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. అయితే కలెక్షన్స్ పరంగా హిట్ అవ్వలేక పోయింది..
మరి ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించారు.. ఈ సినిమా విషయంలోనే కంగనా ఫైర్ అవుతూ.. ”మీ పని అయిపోయింది.. డబ్బులు వేస్ట్ చేయకుండా బాలీవుడ్ నుండి వెళ్ళిపో” అంటూ ఈమె చేసిన పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తుంది. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా.. మీరు ఇలాంటి పేలవమైన సినిమాలు తీస్తుంటే తిరస్కరణే లభిస్తుంది.
90లలో ఏం చేసారో ఇప్పుడు అదే చేస్తున్నారు.. ఒక సీరియల్ లాంటి సినిమాకు 250 కోట్ల ఖర్చు చేసినందుకు సిగ్గుగా లేదా.. సెట్స్, కాస్త్యుమ్స్ అన్ని ఫేక్.. టాలెంట్ ఉన్నవాళ్ళను పక్కన పెట్టి వృధా ఖర్చు చేస్తున్నారు. అత్తాకోడళ్ల డ్రామాకు ఇంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. నువ్వేదో గొప్ప ఫిలిం మేకర్ అనుకుంటున్నావు.. కానీ నే పని అయిపోయింది.. డబ్బు నాశనం చేసుకోకుండా రిటైర్ అవ్వు అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాదు రణ్వీర్ సింగ్ కు కూడా ఒక ఉచిత సలహా ఇస్తూ నువ్వు కరణ్ జోహార్ ను ఫాలో అవ్వొద్దు.. అతనిలా బట్టలు వేసుకుని నీ వేషధారణ వల్ల మన సంస్కృతిని నాశనం చెయ్యకు.. నీకు తెలియక పోతే మన సౌత్ హీరోలను చూసి నేర్చుకో.. అంటూ ఘాటుగా చెప్పింది. ఈ పోస్ట్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.