31.9 C
India
Monday, May 6, 2024
More

    OG Movie : మరింత వేగంగా #OG.. రెండు నెలల్లో..!

    Date:

    OG Movie
    OG Movie

    OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల వేగం పెంచుతున్నారు. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకుతగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నారు. సాయిధర్ తేజ్ తీస్తున్న బ్రో ఇక రిలీజ్ కు సిద్దమైంది. హరిహర వీరమల్లు షూటింగ్ వేగం పుంజుకుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపించే వరకు వీలైనన్ని ఎక్కువ సినిమాలను పూర్తి చేయాలని ఆయన గట్టిగానే కష్టపడుతున్నారు.

    ఇక సినిమా ప్రాజెక్టుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మొదట్లో ‘హరి హర వీరమల్ల’పై ఫోకస్ పెట్టినా మధ్యలోనే ఆగిపోయాడు. ఆ తర్వాత ‘బ్రో’ సినిమా తీసి శరవేగంగా పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆయన ‘ఓజీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే #OG సినిమాకు అనుకున్న షెడ్యూల్ కంటే మరింత వేగంగా షూటింగ్ చేస్తూ ఆగష్టులోనే పూర్తి చేయాలని ఆయన అనుకుంటున్నారు.

    ఏప్రిల్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నాటికి పూర్తవుతుంది. అంటే నాలుగు నెలల్లోనే ఓ భారీ ప్రాజెక్టును పూర్తి చేస్తాడన్నమాట. #OGలో తన పాత్ర కోసం పవన్ కళ్యాణ్ నిర్మాత దానయ్య నుంచి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఆ తర్వాత దర్శకుడు సుజీత్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, పవన్ కళ్యాణ్ ప్రమేయం లేని సినిమా సన్నివేశాలను ఆగస్టు నుంచి మొదలుపెడతారు. ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలను ఈ ఏడాది లైనప్ నుంచి తొలగించారు.

    ఏపిలో ఎన్నికలు షెడ్యూల్ వచ్చేందుకు ఇంకా 10 వరకు మాత్రమే గడువు ఉంది. దీనికి ముందు కూడా కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. దీని కోసం షూటింగ్ లో అప్పుడప్పుడు గ్యాప్ తీసుకుంటున్నా..డైరెక్ట్ గా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అయితే అప్పటి వరకూ సినిమాలు ఎన్ని వీలైతే అన్నింటిని పూర్తి చేయాలని చూస్తున్నారు. గతంలో ఓజీ షూటింగ్ షడ్యూల్ పూర్తవగానే హరీశ్ శంకర్  కు కాల్ చేసిన పవన్ కుమార్ ఉస్తాద్ భగత్ సింగ్ కు కాల్ షీట్లు ఇచ్చారట. ఏది ఏమైనా ఓజీ మాత్రం వేగంగా అభిమానుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan & Mahesh : ఓజీలో మహేష్ .. గుంటూరు కారం కోసం పవన్.. ఈ వార్తల్లో నిజమెంత..?

    Pawan & Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల...

    #OG Glimpse : ఓజీ గ్లింప్స్ చూస్తే పరేషానే?

    #OG Glimpse : పవన్ కల్యాణ్ తాజా సినిమాలు విడుదల కానివి ఇంకా...