40 C
India
Sunday, May 5, 2024
More

    Kajol : కాజోల్ తో కెరీర్ ప్రారంభించినా.. అతడి జీవితంలో అంతులేని వేదన

    Date:

    Kajol kamal sadana
    Kajol kamal sadana

    Kajol : కమల్ సదానా ఒకప్పటి హీరో. కాజల్ తో కెరీర్ ప్రారంభించినా తరువాత కాలంలో ఆయనకు కాలం కలిసిరాక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బెఖడి చిత్రం ద్వారా కాజోల్ తో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా హిట్ అయింది. కానీ తరువాత వచ్చిన సినిమాలు అంతలా ఆడలేదు. దీంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. అనుకోకుండా జరిగిన విషాదం అతడి జీవితాన్ని మరో మలుపు తిప్పింది.

    తఖ్ ధీర్, ఏక్ సే బద్కర్ ఏక్, యాకీన్ వంటి చిత్రాలు నిర్మించిన దర్శకుడు బ్రిజ్ సదానాకు కమల్ జన్మించాడు. బ్రిజ్ 1960-70లో బాలీవుడ్ లో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 1980 మద్య నాటికి కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. 1990లో కమల్ పుట్టిన రోజు ఓ దారుణం చోటుచేసుకుంది. ఆ వేడుకలో తన తండ్రి తల్లి, చెల్లిని తుపాకీతో కాల్చి చంపాడు. తరువాత అతడు కూడా కాల్చుకుని చనిపోయాడు. తరువాత కమల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.

    కమల్ తిరిగి 2000లో విడుదలైన కాళీ టోపీ లాల్ రుమాల్ తర్వాత విరామం తీసుకున్నాడు. ఐదేళ్ల తరువాత 2005లో తన దర్శకత్వం వహించిన కర్కాష్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. టీవీ షో కసమ్ లో సహాయక పాత్ర పోషించాడు. 2007లో తన తండ్రి నిర్మించిన చిత్రానికి రీమేక్ గా విక్టోరియా నంబర్ 203ను నిర్మించాడు. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆదరణ పొందలేదు.

    తరువాత రోర్ చిత్రానికి కమల్ దర్శకత్వం వహించాడు. తరువాత 15 ఏళ్లకు 2022లో విడుదలైన సలామ్ వెంకీతో నటుడిగా మళ్లీ తెరమీదకు వచ్చాడు. తరువాత 30 ఏళ్లకు కాజోల్ తో హీరోగా కనిపించాడు. కాజోల్ తోనే కెరీర్ ప్రారంభించి ఇన్నాళ్లకు కూడా మళ్లీ ఆమెతోనే రీ ఎంట్రీ ఇచ్చి తన కష్టాలను అధిగమించాడు కమల్ సదాని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెప్పినట్లు ఎక్కడ నష్టపోయామో అక్కడే లాభాలు తెచ్చుకోవాలి.

    బాలీవుడ్ లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒక సినిమా ఏడాది పాటు షూటింగ్ జరుపుకుంటుంది. అందులో ఉండే పాత్రలు కూడా మారుతుంటాయి. మొదట్లో ఉన్న వారు చివరి దాకా ఉండరు. మధ్యలోనే మార్పులు చోటుచేసుకుంటాయి. ఇలాంటి బాలీవుడ్ లో ఎందరో తమ జాతకాలను పరీక్షించుకున్నవారు న్నారు. అలాంటి వారిలో కమల్ సదాని కూడా ఒకరు కావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kajol Sensational Comments : కత్తిలాంటి ఫిగర్ లేకపోయినా హీరోయిన్లకు ఛాన్సులు వస్తున్నాయ్.. కాజోల్ సెన్సేషనల్..!

    Kajol Sensational Comments : ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు అవకాశాలు బాగా...

    క్లీవేజ్ షోతో పోటీపడిన తల్లీ కూతుర్లు

    90 వ దశకంలో గ్లామర్ తారగా ఒక ఊపు ఊపేసిన బాలీవుడ్...

    కాజోల్  కు ఫ్రెంచ్ కిస్ ఇచ్చిన నటుడు

    కాజోల్ ను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ......ఆమె నా చిన్నప్పటి...