
కాజోల్ ను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ……ఆమె నా చిన్నప్పటి క్రష్ అలాంటిది ఆమెతో ఫ్రెంచ్ కిస్ చేయాల్సి రావడంతో నా జన్మ ధన్యమైందని అంటున్నాడు బ్రిటీష్ – పాక్ నటుడు అలీ ఖాన్. ద గుడ్ వైఫ్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో కాజోల్ – అలీ ఖాన్ జంటగా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను కాజోల్ – అజయ్ దేవ్ గన్ నిర్మిస్తుండటం విశేషం.
కాగా ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ఫ్రెంచ్ కిస్ ఇచ్చే సీన్ ఉందట. అయితే ఆ సీన్ ఎలా చేయాలని బాగానే ప్రాక్టీస్ చేసారట అటు కాజోల్ ఇటు అలీ ఖాన్. చివరకు దిగ్విజయంగా ఫ్రెంచ్ కిస్ సీన్ ను పూర్తి చేశారట దాంతో థాంక్యూ డార్లింగ్ అని అందట కాజోల్ . దాంతో మరింతగా సంతోష పడుతున్నాడు అలీ ఖాన్.
తాను ఎంతగానో అభిమానించే హీరోయిన్ తో నటించడమే ఎక్కువ అనుకుంటే ఆమెతో ఫ్రెంచ్ కిస్ సీన్ లో నటించడం మరింత గొప్ప విషయం కాగా ఆ సీన్ పర్ ఫెక్ట్ గా చేయడంతో కాజోల్ థాంక్యూ డార్లింగ్ అంటూ కితాబు ఇవ్వడంతో మరింతగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అయితే ఈ సన్నివేశం చిత్రీకరించే సమయంలో అజయ్ దేవ్ గన్ అక్కడ లేడట ! దాంతో ఇద్దరు కూడా కంఫర్ట్ గా ఫ్రెంచ్ కిస్ సీన్ చేసారన్నమాట.