
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు అవకాశాలు బాగా పెరిగాయి.. ఈ క్రమంలోనే వెండితెర లేదంటే బుల్లితెర ఏదో ఒక చోట అవకాశాలు అందుకుంటూ యువత దూసుకు పోతున్నారు.. అలాగే యూట్యూబ్, ఓటిటి ప్లాట్ ఫామ్ లలో కూడా అవకాశాలు అందుకుంటూ రాణిస్తున్నారు.. దీంతో ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం బాగా పెరగడంతో ముద్దుగుమ్మలకు ఛాన్సులు ఎక్కడో ఒకచోట అందుతున్నాయి.
ఈ విషయం మీద తాజాగా సీనియర్ హీరోయిన్ కాజోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా ఓటిటి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. దీంతో ఈ భామ ఓటిటి లను పొగిడేస్తూ వెండితెరతో సమానం అంటూ పెద్ద తెరను సైతం ఓటిటి రంగం శాసిస్తుంది అంటూ ఈమె చెప్పుకొచ్చింది.
ఓటిటి రంగంలో నటీమణుల గురించి కూడా మాట్లాడింది. నిజంగా ఈ రంగంలో టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారని.. తమ టాలెంట్ తో ఎదుగుతున్నారని కాజల్ వారిపై ప్రశంసలు కురిపించింది. అంతేకాదు ఈ ప్లాట్ ఫామ్ మీద నటీమణులకు 24 అంగుళాల నడుము, 36 అంగుళాల కొలతలు లేకపోయినా ఛాన్సులు వస్తున్నాయని..
హీరోలు అవ్వాలంటే 46 అంగుళాల ఛాతీ కూడా చూపించాల్సిన పని లేదని కాజల్ వ్యాఖ్యానించింది. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి.. ఎన్నో దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ భామ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకు పోతుంది.. కుర్ర భామలను ఏ మాత్రం తగ్గకుండా బోల్డ్ నెస్ చూపిస్తూ రాణిస్తుంది.