MLC Candidates : గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అలీ ఖాన్ పేర్లను కేబినెట్ ఆమోదిం చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన క్యాబి నెట్ భేటీలో ఆమేరకు తీర్మానం చేశారు.
ఈ తీర్మానాన్ని కాసేపట్లో గవర్నర్ కు ప్రభుత్వం పంపనుంది. ఇటీవల వీరి నియామకంపై హైకోర్టు అభ్యంతర వ్యక్తం చేయడంతో ప్రభుత్వం గవర్నర్ కు మరోసారి సిఫారసు చేయనుంది.
గవర్నర్ ఆమోదం తెలిపితే వీరు ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారు. ఆ తర్వాత శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.
గతంలోని వీరిద్దరీని ఎమ్మెల్సీ లుగా ప్రకటించిన కొన్ని అడ్డంకుల కారణంగా లేటు అయింది. మరో సారి సీఎం రేవంత్ రెడ్డి మరో సారి క్యాబినెట్ తో చర్చించి తీర్మానం చేసి గవర్నర్కు పంపారు.