28.6 C
India
Wednesday, May 8, 2024
More

    Highest Remuneration : సౌత్ లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు వీరే..

    Date:

    Highest Remuneration : ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, లోకేశ్ కనగరాజ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్న సౌత్ డైరెక్టర్స్ సౌత్ ఇండస్ట్రీని నార్త్ కంటే బలంగా మార్చారు. యాక్షన్ ప్యాక్డ్ కథనాలతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. బాహుబలి, లియో, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు దక్కించుకోవడమే కాకుండా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. పర్యవసానంగా, నటులు ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో సౌత్ వారు చేరారు. వారి గురించి తెలుసుకుందాం.

    రజినీకాంత్ (రూ.150 కోట్లు-210 కోట్లు)
    1975లో ‘అపూర్వ రాగంగళ్’ అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసిన రజినీకాంత్ తనదైన శైలి, చరిష్మాతో స్టార్ డమ్ కు ఎదిగారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ కెరీర్ లో రజనీకాంత్ యాక్షన్, డ్రామా, కామెడీతో పాటు పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. దాదాపు రూ.430 కోట్ల నికర సంపదతో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దక్షిణాది నటుడిగా రజినీకాంత్ నిలిచారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం ఆయన రూ.110 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

    దళపతి విజయ్ (రూ.130 కోట్లు-200 కోట్లు)
    దాదాపు రూ.474 కోట్ల నికర సంపదతో దళపతి విజయ్ గా పేరొందిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న దక్షిణాది నటుల్లో ఒకరిగా నిలిచారు. విజయ్ ప్రధానంగా తమిళ సినిమాల్లో పనిచేస్తున్నాడు. దక్షిణ భారత సినిమాలో అత్యంత ప్రభావంతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1984లో ‘వెట్రి’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి కెరీర్ ను మొదలు పెట్టారు. 1992లో తన తండ్రి ఎస్ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘నాలయ్య తీర్పు’ చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు.

    2023లో ఆయన నటించిన ‘వారిసు’, ‘లియో’ ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లు, రూ.612 కోట్లు వసూలు చేశాయి. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా ‘లియో’ నిలవడం గమనార్హం.

    ప్రభాస్ (రూ.100 కోట్లు-200 కోట్లు)
    రాజమౌళి బాహుబలితో విపరీతమైన ఫామ్ లోకి వచ్చాడు ప్రభాస్. దాదాపు రూ.241 కోట్ల నికర విలువతో ప్రభాస్ కొనసాగుతున్నారు. ఆయన నటించిన ఆదిపురుష్ వివాదాలను ఎదుర్కొని ఫ్లాప్ గా నిలిచినప్పటికీ తర్వాత వచ్చిన సలార్ చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది.

    కమల్ హాసన్ (రూ.100 కోట్లు-150 కోట్లు)
    విశ్వనటుడిగా గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, చిత్ర నిర్మాత, రచయిత, రాజకీయ నాయకుడు, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో సినిమాలు చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నట జీవితాన్ని ప్రారంభించి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ నటుల్లో ఒకరిగా ఎదిగారు. వివిధ జానర్లలో 220కి పైగా చిత్రాల్లో నటించారు. రూ.150 కోట్ల నికర ఆస్తులతో కమల్ హాసన్ దక్షిణాది చిత్రసీమలో లెజెండరీ పర్సన్. 2023లో ఈ నటుడికి ఎలాంటి విడుదలలు లేనప్పటికీ, మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయుడు 2ను ఈ మధ్యే అనౌన్స్ చేశారు.

    అల్లు అర్జున్ (రూ.100 కోట్లు-125 కోట్లు)
    అల్లు అర్జున్ 2003లో ‘గంగోత్రి’తో వెండితెరకు పరిచయమయ్యాడు. స్టైలిష్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం విస్తృతమైన ప్రశంసలను పొందాడు. దాదాపు రూ.350 కోట్ల నికర విలువతో అల్లు అర్జున్ 2021 తెలుగు చిత్రం ‘పుష్ప: ది రైజ్’లో ప్రధాన పాత్ర పోషించి దేశం అంతటా గుర్తింపు పొందారు. ‘పుష్ప2: ది రూల్’ సీక్వెల్ 2024లో విడుదల కానుండగా, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు.

    అజిత్ కుమార్ (రూ.105 కోట్లు)
    అజిత్ కుమార్ 1980ల చివరలో సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. 1990ల మధ్య కాలంలో ప్రధాన నటుడిగా పురోగతి సాధించాడు. ఈ నటుడిని అభిమానులు ‘తలా’ అని పిలుస్తారు. ఇది పరిశ్రమలో అతని అపారమైన ప్రజాదరణ ఉందని చూపిస్తోంది. తన కెరీర్ మొత్తంలో, అజిత్ అనేక వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల్లో నటించాడు, అతనికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘వాలి’, ‘విలన్’, ‘మన్మథ’, ‘వీరం’, ‘విశ్వాసం’ వంటి చిత్రాల్లో నటించారు.

    దాదాపు రూ.196 కోట్ల నికర సంపదతో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దక్షిణాది నటుల్లో అజిత్ కుమార్ ఒకరు. 2023 లో విడుదలైన ‘తునివు’ చిత్రంలో అతని నటన ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం రూ. 130 కోట్లు రాబట్టింది.

    రామ్ చరణ్ (రూ.100 కోట్లు)
    చిరంజీవి తనయుడు రామ్ చరణ్. 2007 లో ‘చిరుత’తో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఇది అతనికి ఉత్తమ మేల్ డెబ్యూ – సౌత్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది. అప్పటి నుంచి, అతను వాణిజ్య పరంగా విజయవంతమైన చిత్రాల్లో నటించారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇప్పుడు ఒక్కో ప్రాజెక్టుకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎస్.శంకర్ దర్శకత్వంలో కియారా అద్వానీతో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ratan Rajput : సౌత్ హీరోలంతా పడుకోమని అడుగుతారు.. హీరోయిన్ దారుణమైన కామెంట్స్.. 

    Ratan Rajput క్యాస్టింగ్ కౌచ్ అనే పదం అప్పట్లో సృష్టించిన సంచలనం...