Ratan Rajput క్యాస్టింగ్ కౌచ్ అనే పదం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. మీటూ ఉద్యమం తర్వాత కాస్టింగ్ కౌచ్ అనే పేరును తెరమీదకు తీసుకు వచ్చారు.. ఇక అప్పటి వరకు ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి భయపడిన వారంతా అప్పటి నుండి ఒక్కొక్కరిగా బయటకు వచ్చి వారికీ జరిగిన దారుణాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు..
ఇప్పటికి కూడా తరచు ఎవరో ఒకరు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఆ కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. ఇక క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువుగా వినిపించేది బాలీవుడ్ లో.. నార్త్ తో పోలిస్తే సౌత్ లో చాలా తక్కువుగానే ఉంటుంది.. అయితే తాజాగా ఒక నటి మాత్రం సౌత్ లో కూడా బాగా కాస్టింగ్ కౌచ్ ఉందని అంటుంది.
ఆమె ఎవరంటే బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించిన ప్రముఖ నటి రతన్ రాజ్ పుత్.. ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ భామ మాట్లాడుతూ..
సౌత్ లో చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ అక్కడ ఎక్కువ మంది చెడ్డవారే ఉన్నారు.. కొంత మంది మాత్రమే మంచి వారు ఉన్నారు.. ఆడిషన్స్ కు వెళ్లిన ప్రతీ చోట కాంప్రమైజ్ కావాలంటూ కండిషన్స్ పెట్టారు.. డైరెక్టర్, నిర్మాత, హీరో, సినిమాటోగ్రాఫర్ ఎవరు పిలిచినా పడుకోవాలంటూ ఓపెన్ గా చెప్పడంతో చాలా బాధ అనిపించింది.
అందుకే సౌత్ ఆఫర్స్ వద్దని బాలీవుడ్ కు వచ్చేసాను.. బాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ అక్కడ కమిట్మెంట్ ఇవ్వకపోయినా ఆఫర్స్ వస్తున్నాయి.. అవి చాలు అందుకే సౌత్ ఆఫర్స్ వచ్చిన పట్టించుకోవడం లేదంటూ ఈ భామ చెప్పుకొచ్చింది.