YS Jagan : తెలుగు దేశం-జనసేన పొత్తు సీట్ల పంపకంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం. ఎన్నికలకు ముందు వైసీపీ పూర్తి స్థాయిలో ప్రచారంను ప్రారంభించడంతో ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకు హీట్ పెరుగుతోంది. జనసేన + టీడీపీ భేటీకి సర్వం సిద్ధం కాగా, రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారోనని కూటమి మద్దతుదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు ‘సిద్ధం’లో మాట్లాడారు.
ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు అసెంబ్లీ ఎన్నికలకు కులం ఆపాదించి దీన్ని కుల యుద్ధంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ ఇక్కడ జరుగుతున్నది వర్గ పోరు అని సీఎం జగన్ అన్నారు. ఇప్పటి వరకు తాను చేయగలిగిందంతా చేశానని చెప్పిన జగన్ వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను వైసీపీ పార్టీ క్యాడర్, నాయకులపై ఉందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేయ పథకాలను ఎంత వేగంగా, ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే.. అంతే వేగంగా మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. సరిగ్గా ఇదే అర్థం వచ్చేలా సిద్ధంలో వైఎస్ జగన్ మాట్లాడి కేడర్, నాయకుల్లో ఉత్సాహం నింపారు. ఈ సారి గెలుపు నల్లేరుపై నడకే అంటూ వైసీపీ వర్గాలు చెప్తున్నా.. కత్తిమీద సామని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
రాష్ట్రానికి తాను చేసిన సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ ఏ రాజకీయ నాయకుడు, పార్టీ ఇవ్వలేని శక్తిని, అస్త్రాలను పార్టీ నేతలకు ఇచ్చానని జగన్ పేర్కొన్నారు. రాబోయే 45 రోజుల్లో నిర్విరామంగా ప్రచారం చేసి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నేతలపై ఉందని జగన్ అంటున్నారు. కుప్పం, ఇచ్ఛాపురం సీట్లను కూడా గెలుచుకొని వైసీపీ 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.