America : అమెరికాలో ప్రవాస భారతీయుడు, తెలుగు వాడు అయిన ఓ వ్యక్తికి శిక్ష పడింది. ఏకంగా నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.8 కోట్ల జరిమానా విధించింది. తెలుగు వారిని రూ.16 కోట్ల మేర మోసగించినందుకు అతడికి ఈ శిక్ష పడింది. ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు 44 ఏళ్ల జైలుతో అతడికి శిక్ష ఖరారైంది. ఏ దేశంలో అయినా తప్పు చేస్తే తగిన శాస్తి జరుగుతుంది. ఇందులో భాగంగానే అతడికి శిక్ష పడటం గమనార్హం.
రవాణా శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్న తెలుగువాడైన అరుణ్ కుమార్ ట్రియాంగిల్ ఏరియా తెలుగు సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2017-21 మధ్య కాలంలో 15 మంది వద్ద రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు నేరం రుజువైంది. దీంతో పెట్టుబడులు పెట్టకుండా చెల్లింపులు చేశాడనే అభియోగం నమోదైంది.
మంగళవారం కోర్టులో నేరం అంగీకరించినందుకు గాను శిక్ష పడింది. దివాళా తీస్తున్నట్లు అరుణ్ ప్రకటించగానే అతడికి డబ్బులిచ్చిన వారు ఫిర్యాదు చేయడంతో కేసు ముందుకు కదిలింది. అరుణ్ తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేయడంతోనే నేరం గురించి అందరికి తెలిసింది.
అలా తెలుగువారినే మోసం చేసిన అరుణ్ కుమార్ అక్రమంగా డబ్బు సంపాదించాడని ఆరోపణలు చేసింది. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అతడి నేరాలను రుజువు చేశారు. దీంతో అతడికి శిక్ష పడింది. ఏ దేశంలో అయినా నేరాలకు పాల్పడితే ఉపేక్షించరు. శిక్షిస్తారు. ఇంత చిన్న విషయం తెలియని అరుణ్ కుమార్ నేరాల వల్ల అతడికి సరైన శిక్షే పడిందని తెలుగువారు చర్చించుకుంటున్నారు.