37.7 C
India
Saturday, April 27, 2024
More

    Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు తాగితే లాభమా? నష్టమా?

    Date:

    Drink Warm Water
    Drink Warm Water

    Drink Warm Water : ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) గోరు వెచ్చటి నీరు తాగితే చాలా లాభాలు ఉంటాయని పెద్దలు చెప్తారు. మోషన్ ఫ్రీగా అవడంతో పాటు పొట్ట తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయని, ఇక అందులో నిమ్మకాయ, తేనె వేసుకుంటే మరి కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. పెద్దలు చెప్పింది నిజమేనా.. వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారు. అసలు ఉదయం పరగడుపున గోరు వెచ్చటి నీరు తాగడం లాభమా? లేక నష్టమా? లాంటి అనుమానాలను నివృత్తి చేసుకుందాం.

    సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో ప్రతీ ఒక్కరి చేతిలోకి సెల్ ఫోన్లు వచ్చాయి. దీంతో ఏ సమాచారం కావాలన్నా ఒక్క మీట (టచ్)తో తెలుసుకోవచ్చు. ఇందులో ఆరోగ్యానికి సంబంధించి వార్తలు కూడా వస్తున్నాయి. వీటిని కొందరు పాటిస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు టిప్స్ ఫాలో అవుతున్నారు. రిమోట్ ప్రపంచం కాబట్టి ఊబకాయం (హెవీ వెయిట్) కూడా పెరుగతూ వస్తోంది. వాటి కోసం టిప్స్ దొరుకుతుంటాయి. ఇలాంటి టిప్ లలో ఒకటి పరగడుపున (ఖాళీ కడుపుతో)వేడి నీరు తాగడం.

    * గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. పేగుల్లో కదలికలు ఎక్కువగా జరుగుతాయి. జీర్ణ వ్యవస్థ క్రమశిక్షణగా ఉంటూ మలబద్ధకం సమస్యలు ఉండవు.

    * పరగడుపున గోరు వెచ్చని నీటిని తాగితే బరువు తగ్గడంలో ఎంతో కొంత తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కడుపు నిండిన అనుభూతి కలగడం, ఆహారం త్వరగా జీర్ణమై కొవ్వు తగ్గి అధిక బరువు నుంచి కూడా ఉప శమనం కలుగుతుంది.

    * చలికాలంలో జలుబు, ముక్కుదిబ్బడ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగితే ముక్కు దిబ్బడ సమస్య నుంచి బయటపడచ్చు. శ్వాస తీసుకోవడం తేలిక అవుతుంది. కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.

    దుష్ఫ్రభావాలు..
    గోరు వెచ్చని నీటిని తాగితే లాభాలున్నాయనడం ఎంత నిజమో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయన్నది అంతే నిజం అని నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి తీసుకుంటే దుష్ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

    * వేడి నీటిని మోతాదుకు మించి తీసుకుంటే శరీరంలో నీటి సాంద్రతలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల డీహైడ్రేషన్‌ సమస్యలకు అవకాశం పెరుగుతుంది.

    * అది నిద్రలేమికి కూడా కారణం కావచ్చు. ఇది స్లీప్‌ క్లాక్‌పై ప్రభావం చూపుతుంది.

    * మూత్ర పిండాలపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మూత్ర పిండాల పనితీరులో ఛేంజస్ వస్తాయని చెబుతున్నారు.

    నోట్‌: కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే అన్నింటికన్నా ఉత్తమం.

    Share post:

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vitamin Deficient : కోపం ఎక్కువ వస్తుందా? ఈ విటమిన్ లోపం ఉన్నట్లే?

    Vitamin Deficient : ‘తన కోపమె తన శత్రువు, తన శాంతమే...

    Benefits of Running : పరుగుతో ప్రయోజనాలెన్నో

    Benefits of Running : ఇటీవల కాలంలో అందరు అధిక బరువుతో...

    Drinking Water : ఇవి తిన్న వెంటనే నీళ్లు తాగితే అనర్థాలే

    Drinking Water: మనం బతకడానికి తింటాం. కానీ కొందరు తినడానికి బతుకుతారు....

    Benefits of Garlic : వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

    Benefits of Garlic :  వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనం...