35.1 C
India
Monday, April 29, 2024
More

    Vitamin Deficient : కోపం ఎక్కువ వస్తుందా? ఈ విటమిన్ లోపం ఉన్నట్లే?

    Date:

    Vitamin Deficient
    Vitamin Deficient Causes Angry

    Vitamin Deficient : ‘తన కోపమె తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష’ అని పెద్దలు ఊరికే అనలేదు. కోపం ఎక్కువైతే శరీరంలో తీవ్ర మార్పులు జరుగుతాయి. బీపీ ఎక్కువ కావడం.. ఇది కాస్తా హార్ట్, కిడ్నీలపై ప్రభావం చూపడం జరుగుతుంది. అయితే కోపం ఎక్కువ వచ్చేందుకు విటమిన్ లోపం అని కూడా కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.

    ఎమోషన్ అనేది ప్రతీ వ్యక్తికి.. అంతెందుకు ప్రతీ జీవికి సర్వ సాధారణం. అందులో భాగమే కోపం. ఈ కోపం వల్ల సదరు వ్యక్తిపై నెగెటివ్ ఇంపాక్ట్ కూడా పడే అవకాశం ఉంది. దీంతో పాటు మరెన్నో సమాజిక, మానసిక సమస్యలకు కోపం కారణం అవుతుంది. అందుకే కోపాన్ని తగ్గించుకొని సంతోషాన్ని పెంచుకోవాలని చెప్తుంటారు.

    కోపం వచ్చేందుకు బయట ఎన్నో కారణాలు ఉన్నా.. అంతర్గతంగా విటమిన్ లోపం కూడా ఒక కారణం. కొన్ని రకాల విటమిన్ల లోపం వల్ల మనిషికి తరుచూ కోపం వస్తుంది.? ఏ విటమిన్ లోపం వల్ల కోపం వస్తుంది.. దానిని ఎలా అధిగమించవచ్చు.. ఏ ఫుడ్ తీసుకోవాలి తెలుసుకుందాం.

    * విటమిన్‌ బీ-6లోపం వల్లే తరచూ కోపానికి గురవుతారు. ఈ విటమిన్‌ మెదడుకుపై ప్రభావం చూపిస్తుంది. ఈ విటమిన్ ఉంటే మెదడు బాగా పని చేస్తుంది.  శరీరానికి సరిపడా బీ-6 విటమిన్‌ అందకపోతే కోపం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    * మరో ప్రధాన కారణం విటమిన్‌ బీ-12. ఈ విటమిన్‌ లోపం ఉంటే అలసట, నీరసం ఉంటుంది. అనవసర విషయాలపై కూడా చిరాకు పెరుగుతుంది. విటమిన్‌ బీ-12 లోపంతో డిప్రెషన్‌కు గురవుతారని నిపుణులు చెప్తున్నారు.

    * శరీరానికి సరిపడా జింక్‌ లేకుంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. జింక్‌ లోపంతో మానసిక కల్లోలం, ఆందోళన, డిప్రెషన్‌, చిరాకు  కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

    * మెగ్నీషియం కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి సరిపడా లేకుంటే మానసిక ఒత్తడి పెరుగుతుంది. నిత్యం చికాకు కలిగేందుకు కారణం కావచ్చు.

    * నిత్యం మానసిక ఒత్తిడతో బాధపడేవారు వారు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఎక్కువ మూడ్‌ బూస్టింగ్ ఫుడ్స్‌ తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది.

    ఆహారంలో విటమిన్‌ బీ-6, విటమిన్‌ బీ-12 ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పచ్చి ఆకు కూరలు, అవకాడో, మాంసం ఆహారంలో భాగం చేసుకోవాలి. జింక్‌, మెగ్నీషియం ఎక్కువగా ఉండే.. చేపలు, బ్రోకలీ, మొలకలను భాగం చేసకోవాలి.

    నోట్‌: కేవలం ప్రాథమిక సమాచారం కొరకు మాత్రమే.. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు, సూచనలపై వైద్యుల సూచనలే ఫైనల్.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు తాగితే లాభమా? నష్టమా?

    Drink Warm Water : ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) గోరు...

    Benefits of Running : పరుగుతో ప్రయోజనాలెన్నో

    Benefits of Running : ఇటీవల కాలంలో అందరు అధిక బరువుతో...

    Drinking Water : ఇవి తిన్న వెంటనే నీళ్లు తాగితే అనర్థాలే

    Drinking Water: మనం బతకడానికి తింటాం. కానీ కొందరు తినడానికి బతుకుతారు....

    Benefits of Garlic : వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

    Benefits of Garlic :  వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనం...