Pawan vs YCP : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ లోని జగన్ సర్కారు పై ఇటీవల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనదైన శైలిలో వైసీపీ మంత్రులు, ప్రభుత్వంపై ఆయన పెద్ద పోరాటమే చేస్తున్నారు. మంత్రులు, సీఎం అవినీతి పరులు, దోపిడి దొంగలంటూ మండిపడుతున్నాడు. కొండలు, గుట్టలు, ఇసుక, మట్టి, మద్యం ఇలా అన్నిటినీ తమ గుప్పిట్లో పెట్టుకొని అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు.
అయితే అందరినేరాల చిట్టా తన వద్ద ఉందని, కేంద్రానికి పంపానని ఆయన ఇటీవల సీరయస్ కామెంట్లు చేశారు. అయతే జగన్ ప్రభుత్వం పై దాడి కొనసాగిస్తూనే దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని, జైలులో పెట్టుకోండి అంటూ సవాల్ విసిరారు. అయితే ఇటీవల పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మీద కేసుల మీద కేసులు పెట్టిన జగన్ సర్కారు జనసేనాని మాత్రం ముట్టుకోవడంలేదు. ఇటీవల విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద బహిరంగ సభలో నిబంధనలు అతిక్రమించారంటూ కేసులు నమోదు చేశారు మినహా ఎలాంటి కేసులు పెట్టలేదు.
అయితే నేరుగా జగన్ పై మాటల వర్షం కురిపిస్తున్నా, ప్రభుత్వం మాత్రంఎలాంటి ఎదురుదాడికి దిగడంలేదు. మంత్రులు ప్రెస్మీట్లు పెట్టి ఖండనల వరకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఒకరిద్దరు మంత్రులు దూషణలకు దిగుతున్నారు. అయితే రానున్న రోజుల్లో పవన్ మాత్రం తన జోలికి వస్తే తాట తీస్తానంటూ వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. మరి వైసీపీ సర్కారు మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి చర్యలకు దిగడం లేదు. ఎన్నికల సమయంలో పవన్ తో పెట్టకుంటే చాలా ఇబ్బంది అవుతుందని, తద్వారా పవన్ కు సానుభూతి పెరుగుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.