
Jai Sriram song : ఆదిపురుష్.. ఈ సినిమా కోసం ఎంతగానో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది మొదట్లోనే రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ ఇది. దీంతో ముందు నుండి కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయనను రాముడి పాత్రలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసారు.. కానీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేసారు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. మధ్యలో టీమ్ చేసిన కొన్ని పొరపాట్ల వల్లనే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ టాక్ ను పోగొట్టుకుని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది..
ఈ మధ్యనే వచ్చిన ట్రైలర్ తో అంచనాలు పెంచేసుకుంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ ఎంత అలరించిందో.. జై శ్రీరామ్ సాంగ్ కూడా అంతే అలరించింది. ఈ సాంగ్ అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది..
ఈ సినిమా రిలీజ్ కు మరో నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ మరింత స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు. ఈ విషయాన్నీ స్వయంగా ప్రకటిస్తూ చిన్న వీడియోను కూడా షేర్ చేసారు.. అజయ్ – అతుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లోని ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇచ్చారు. జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో వేచి చూడాలి..