KCR-Harish : తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పటికైనా మేనల్లుడి పోటు తప్పదని ప్రత్యర్థి పార్టీలు అంటూ వుంటాయి. తాజాగా ఆ సమయం దగ్గరకు వచ్చిం దని… త్వరలోనే హరీష్ రావు పార్టీ మారబోతు న్నా రని మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు బిజెపిలో చేరతారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసా రు. ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకపోతే ఆయన బిఆ ర్ఎస్ ను వీడటం ఖాయమని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.
ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ ఎంపీ బిబి పాటిల్ బిజెపిలో చేరారు. జహిరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన మాజీ మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడు. అలాగే హరీష్ వర్గానికి చెందిన మరికొందరు కూడా బిజెపిలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇలా లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో చోటుచేసుకుం టున్న పరిణామాలు ఇప్పటికే పొలిటికల్ హీట్ పెంచాయి.ఇప్పుడు హరీష్ బిఆర్ఎస్ నుండి జంప్ అవుతాడన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఈ హీట్ ను మరింత పెంచాయి.
ఇక వరుసగా సిట్టింగ్ ఎంపీలు బిఆర్ఎస్ ను వీడగా మరికొందరు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగతోంది. జహిరా బాద్, నాగర్ కర్నూల్ ఎంపీలు బిబి పాటిల్, రాము లు ఇప్పటికే కాషాయ పార్టీలో చేరి ఇంతకాలం కొనసాగిన బిఆర్ఎస్ పైనే పోటీకి సిద్దమవుతు న్నారు. ఇక ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా బిఆర్ఎస్ ను వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా వున్న నేపథ్యంలో నామాను బిజెపిలో చేర్చుకుని పోటీ చేయించాలని కమలం నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.