22.7 C
India
Tuesday, January 21, 2025
More

    KCR Wishes : మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ 

    Date:

    KCR Wishes
    KCR Wishes

    KCR Wishes : హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాలచేత పూజలందుకుంటున్న మేడారం సమ్మ క్క సారలమ్మ మహా జాతర (Medaram Jathara) సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

    రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిందని అన్నారు.

    తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో సమ్మక్క, సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్య పాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరీ లోయ పరీవాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని అన్నారు.

    రాష్ట్రం నలుమూలలనుంచి దేశవ్యాప్తంగా తల్లుల దర్శనార్థం కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎటు వంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించా లని ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. తెలంగా ణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను కేసీఆర్ ప్రార్థించారు.

    Share post:

    More like this
    Related

    Indian Travelers : భారత ప్రయాణికులు యూకే ద్వారా వెళుతున్నారా? అయితే మీకు షాక్

    Indian travelers : అమెరికా, కెనడా సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి వచ్చే...

    Trump : 84 శాతం మంది భారతీయులు ట్రంప్ రాకను స్వాగతిస్తున్నారట

    Trump : యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ECFR) నిర్వహించిన గ్లోబల్...

    Sankranti Celebrations : బ్రిటన్ లో అంబరాన్నంటిన తెలుగువారి సంక్రాంతి సంబరాలు

    Sankranti Celebrations : తేటతెలుగువారి ఘన పండుగ సంక్రాంతి. ఆంధ్రాలోనైనా అమెరికాలోనైనా ఈ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR Padhayatra: కేటీఆర్ పాదయాత్ర సక్సెస్ అవుతుందా… ఇప్పుడు చేయడానికి కారణం ఏంటో తెలుసా

    KTR Padhayatra: మాజీ మంత్రి కేటీఆర్ త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నానని ప్రకటించారు....

    BRS Chief : ఫామ్ హౌజ్ లోనే బీఆర్ఎస్ అధినేత.. మౌనం వెనుక వ్యూహం ఉందా..?

    BRS chief KCR : తెలంగాణలో పార్టీ ఓటమి తర్వాత మాజీ సీఎం...

    KCR : ప్రతిపక్షంలోనూ కేసీఆర్ ‘దొర’ పెత్తనమే..

    KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీరు విచిత్రంగా, అప్రజాస్వామికంగా...

    KCR : సార్లంతా ఫుల్ బిజీ.. ‘కారు’ స్టీరింగ్ పట్టేవారేరి?

    KCR  : ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధన కర్తగా...