- టీడీపీ పుట్టి ముంచుతున్న మీడియా హౌస్

Media house : ఏపీ అధికార పక్షంపై ఏబీఎన్ మీడియా విరుచకుపడుతున్న తీరు టీడీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. వైసీపీ మీద దాడి చేస్తున్న తీరుతో టీడీపీ పుట్టి ముంచేలా ఉన్నది. అసలు టీడీపీని ముంచడానికి ఏబీఎన్ అంతర్గతంగా ఏదైనా ఒప్పందం చేసుకుందా అనే అనుమాలను పలువురిలో కలుగుతున్నాయి. అవినాష్ రెడ్డిపై సీబీఐ విచారణ విషయంలో కానీ, అమరావతి అంశాల్లో కానీ ఏబీఎన్ చేస్తున్న అత్యుత్సాహం వెంకటకృష్ణ ఓవరాక్షన్ ను తిప్పి కొట్టేందుకు వైసీపీ సోషల్ మీడియాకు మంచి అవకాశం ఇచ్చినట్లు అవుతున్నది.
ఏబీఎన్ మీడియా తీరు చూస్తుంటే ఏపీలో తానే ప్రధాన ప్రతిపక్షమే రీతిలో వ్యవహరిస్తున్ని. క్షేత్ర స్థాయిలో ప్రజల మనోభావాలు గుర్తించకపోవడం, ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండడంతో వెంకటకృష్ణ వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీకే గతంలో టీవీ5లో ఉన్నప్పుడు.. జగన్ కు సపోర్ట్ గా మాట్లాడగా, ఇప్పుడేమో ఏబీఎన్ తగ్గట్లుగా వ్యవహరిస్తున్నారు. వీకే కామెంట్లను పట్టుకుని ప్రచారం చేసుకోవాలన్నట్లుగా అధికా పా్ర్టీ సోషల్ మీడియా రెడీ కాచుకొని కూర్చున్నది.
అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో వీకే స్పందన మాములుగా లేదు ! అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఏబీఎన్ మాత్రం అరెస్ట్ చేసేసింది అన్నట్లుగా ప్రచారం చేస్తున్నది. విచారణ ప్రతి దశలోనే అతి చేస్తున్నది. టీడీపీ సానుభూతిపరులు కూడా వైసీపీ వైపు మళ్లేలా చేస్తున్నది. ఏబీఎన్ ప్రచారాలపై వైసీపీ నేతలు కామెడీ చేస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా ఏబీఎన్ మీడియా స్వయంగా టీడీపీకి డ్యామేజ్ చేస్తున్నదంటూ వైసీపీ శ్రేణలు సంబుర పడిపోతున్నాయి. మీడియా ఎప్పుడూ ప్రజల ఉండాలని, ఒక పార్టీకి అంటకాగి, ఆ పార్టీ వాయిస్ ను తామే వినిపించడం, చూపించడంపై కొంత వ్యతిరేకత కనిపిస్తున్నది.
ఏబీఎన్ విషయంలో టీడీపీ నేతలు కూడా కొంత అసహనానికి గురవుతున్నారు. ఏబీఎన్ , ఆంధ్రజ్యోతి వల్ల తమకు లాభం జరుగుతుందని టీడీపీకి క్యాడర్ భావించడం లేదు. నష్టమే కలుగుతుందన్న చర్చలు ఆ పార్టీ వర్గాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వ లోపాలను కొన్నింటిని ఏబీఎన్ బయటపెట్టిన, ఆ తర్వాత తతంగమంతా మితిమీరుతున్నది. ఏబీఎన్ మేనేజ్ మెంట్ ఎటుపోతున్నది. ? ఓ మీడియా హౌస్ ను ఇంత దిగజార్చాలా అనే చర్చలు సదరు మీడియా హౌస్ లోని సిబ్బందే చర్చించుకుంటున్నట్లు సమాచారం. గతంలో అంకితాభావడంతో పనిచేసే పాత్రికే బృందం ఉండేది. వారికి అన్ని విషయాలపై పట్టు ఉండేది. ఏది ఏ స్థాయిలో ఉంచాలో పకడ్బందీగా లెక్కలు వేసుకునే వారు.
ప్రస్తుతం అందరూ కొత్త వాళ్లే వచ్చారు. యాజమాన్యాన్ని సంతృప్తి పరిస్తే చాలు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం సోయి లేకుండా విరుచుకుపడుతున్నారు. క్షేత్ర స్థాయి విషయాలపై ఏబీఎన్ యాజమాన్యం ఏ మాత్రం దృష్టిసారించడం లేదు. దీంతో ఏపీలో ఏబీఎన్ నవ్వుల పాలవుతున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏబీఎన్ అతి తగ్గించుకుంటే మంచిదని టీడీపీ కేడర్ కూడా సూచిస్తున్నారు.