Vijay Devarakonda Dance : రౌడీ బాయ్ గా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న విజయ్ దేవరకొండకు ‘లైగర్’ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సినిమాతో తన అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత వచ్చిన ‘ఖుషి’తో కొంత మేర ఒకే అన్నారు. ఇది కూడా ఆశించినంత రాలేదని ఫ్యాన్స్ పదే పదే సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఖుషిలో ప్రధాన లోపం డాన్సులు. డాన్స్ లవర్స్ ను ఈ మూవీ తీవ్రంగా నిరాశ పరిచిందని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన అప్ కమింగ్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ‘నంద నందన’ పాటను ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ పాటలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ రొమాన్స్ ప్రధానంగా వార్తల్లో నిలిచింది. అదే సమయంలో సిద్ద్ శ్రీరామ్ వాయిస్ లో గోపీ సుందర్ కంపోజ్ చేసిన సాంగ్ ట్యూన్ మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి తోడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్ అందరి దృష్టిని ఆకర్షించింది. అభిమానులకు బాగా నచ్చగా, ఈ హుక్ స్టెప్ పై ట్రోల్స్ కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి.
నిజానికి కొందరు ట్రోలర్లు విజయ్ దేవరకొండ వేసిన ఈ స్టెప్ ను జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ స్టెప్స్ తో పోల్చారు. లైగర్, ఖుషీ సినిమాల్లో కూడా విజయ్ దేవరకొండకు ఇలాంటి లెగ్ మూవ్మెంట్స్ ఉన్నాయని కొందరు ట్రోలర్లు అభిప్రాయపడుతున్నారు. డాన్స్ స్టెప్ కి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఈ సాంగ్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది.