40 C
India
Sunday, May 5, 2024
More

    Modi Meeting : ఎలన్ మస్క్ తో మోడీ భేటీ.. ఆ విషయాలపై స్పష్టత..? మరో 24 మంది ప్రముఖులతో కూడా..

    Date:

    Modi meeting
    Modi meeting, Elon Musk

    Modi meeting : భారత ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. బుధవారం నుంచి అమెరికాలో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. ఈ పర్యటనతో ఇండో-అమేరికా భాగస్వామ్యం మరింత బలపేట్లు ఉంది. ప్రస్తుత పర్యటనలో మోడీ షెడ్యూల్ చాలా బిజీగా ఉందని తెలుస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భీటీ కానున్న ఆయన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఆ తర్వాత టెస్లా, ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ తో కూడా ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే దాదాపు 24 మంది ప్రపంచ ధిగ్గజ వ్యాపారులతో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

    పర్యటన అంశాలు..

    ఈ పర్యటనలో మోడీ ఫస్ట్ న్యూయార్క్ లో పర్యటిస్తారు. ఇందులో అధ్యక్షుడితో సహా ప్రభుత్వ ప్రముఖులతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై చర్చించనున్నారు. ఈ చర్చలతో జీ-20, క్వాడ్‌, ఇండో-పసిఫిక్‌ ఎకానమిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ సదస్సుల్లో ఇరు దేశాల భాగస్వామ్యం పెంపొందిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా వేడుకల్లో బుధవారం పాల్గొంటారు. యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహించాలన్న భారత ప్రతిపాదనను అమెరికా ఆమోదించింది. ఈ నేపథ్యంలో అదే చోట వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని మోడీ అన్నారు.

    బైడెన్‌తో ఏం మాట్లాడనున్నారు..?

    న్యూయార్క్‌ పర్యటలన తర్వాత ప్రధాని వాషింగ్టన్‌ వెళ్లనున్నారు. బిజినెస్, టెక్నాలజీ, సృజనాత్మకత వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. బైడెన్‌ చర్చల్లో ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి రోడ్డు మ్యాప్‌ రూపొందిచాలని భారత్ భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులు.. శ్వేతసౌధంలో మోడీకి విందు ఇవ్వనున్నారు. తర్వాత అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతారు. గతంలో ట్రంప్ హయాంలో అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్రధానిగా రికార్డు కూడా మోడీ నెలకొల్పారు. ఈ పర్యటన తర్వాత ఈజిప్టుకు వెళ్లనున్నారు. 25న భారత్‌ చేరుకోనున్నారు.

    ఎలాన్ మస్క్ తో ఏం చర్చించబోతున్నారు.?

    ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా, ట్విటర్ అధినేత ఎలన్ మస్క్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. తొలిసారి వీరు సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత, సైన్స్ కమ్యూనికేటర్ నీల్ డీ గ్రాస్సే టైసన్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ పాల్ మైకేల్ రోమర్‌తోనూ కొన్ని అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భారత మూలాలున్న సింగర్, 2022 గ్రామీ అవార్డు విన్నర్ ఫాలూ షాతో మోదీ మాట్లాడనున్నారు. వీరితో సహా 24 మంది అమెరికాలోని రక్షణ శాఖలో పనిచేసిన మాజీ అధికారులను కలవనున్నారు.

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Elon Musk Neuralink : మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఎలాన్ మస్క్ ప్రయోగాలు ఎటు దారి తీస్తాయో?

    Elon Musk Neuralink : మనిషి తన మెదడుతో ఎన్నో ఆవిష్కరణలు...

    Elon Musk : ఎలన్ మస్క్ ముక్కుపిండీ మరీ మిలియన్ డాలర్లు వసూలు

    Elon Musk : టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ గురించి...

    twitter : ట్విటర్ పిట్ట మాయం.. అసలు “X” అని ఎందుకు పెట్టారు..

    twitter ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన ఎలన్ మస్క్ గతంలో ట్విటర్...