31 C
India
Monday, April 29, 2024
More

    Nara Bhuvaneswari Challenge : లోకేశ్ అరెస్టయినా ‘యువగళం’ ఆపలేరు.. భువనేశ్వరి సవాల్

    Date:

    Nara Bhuvaneshwari's words about Lokesh Yuvagalam Padayatra
    Nara Bhuvaneshwari’s words about Lokesh Yuvagalam Padayatra

    Nara Bhuvaneswari Challenge :

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగించేందుకు సిద్దమవుతున్నాడు. తన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత యువగళం పాదయాత్రకు ఆయన బ్రేక్ వేశారు. ఆ తర్వాత విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించిన తర్వాత లోకేశ్ జాతీయ పార్టీ నాయకులతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. చంద్రబాబుకు బెయిల్ ఇప్పంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. పలువురు నాయకులను కలిసి ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రాష్ర్టపతి ద్రౌపది ముర్ముకు కూడా చెప్పుకొచ్చారు.

    ఇక ఆయన యువగళం పాదయాత్రను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ లోకేశ్ పై కూడా కేసులు నమోదు చేసింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ తోపాటు పలు కేసుల్లో నిందితుడిగా చేర్చింది. ఇక లోకేశ్ అరెస్టు కూడా ఖాయమని వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్ర కొనసాగుతుందా.. లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే టీడీపీ నేతలు మాత్రం యువగళం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా, పాదయాత్ర ఆపేది లేదని లోకేశ్ చెబుతున్నారు.

    అయితే తాజాగా యువగళం పాదయాత్రపై నారా భువనేశ్వరి స్పందించారు. లోకేశ్ ను అరెస్ట్ చేస్తే పాదయాత్ర ఆగదని, మరొకరు ఆ  యాత్రను కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. ఇక నారా బ్రాహ్మణి ఆ యాత్ర కొనసాగిస్తుందని అంతా అనుకుంటున్న నేపథ్యంలో భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తమ కుటుంబాన్ని కుట్రపూరితంగా ఇబ్బంది పెడుతున్నదని, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP MLA- Lokesh: వైసీపీ కి బిగ్ షాక్..లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

      ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కోనేటి...

    Sajjala Fire: వయసు మీద పడి చంద్రబాబు నిద్రపోతే…వయసులో ఉన్న లోకేశ్ కూడా నిద్రపోతున్నాడా? సజ్జల ఫైర్

        డీఎస్సీపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సజ్జల రామకృష్ణ...

    IG Promotion List : ఐజీ ప్రమోషన్ల లిస్టులో తొలిపేరు ఆయనదే.. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకేనా?

    IG Promotion List : ‘‘వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర కూర్చున్నా...’’...

    Nava Sakam Begins : హోరెత్తుతున్న విజయోత్సవ సభ.. లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు

    Nava Sakam Begins : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...