34.5 C
India
Thursday, May 2, 2024
More

    Pawan Kalyan : యువగళం సభకు పవన్ పోవట్లే.. కారణం ఇదేనట!?

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan

    Pawan Kalyan : ఏపీలో ఎన్నికల కోలాహాలం మొదలైంది. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో పార్టీలన్నీ బిజీబిజీగా మారిపోయాయి. ఈ రోజు టీడీపీ, జనసేన ఎన్నికల సమరశంఖాన్ని పూరించేందుకు రెడీ అయ్యాయి. లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. లక్షలాదిగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు జనసేనాని పవన్ కూడా హాజరవుతారని నిర్ణయించారు. కానీ సభకు పవన్ దూరంగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.

    ఈ రోజు సాయంత్రం విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద ‘నవశకం సభ’కు టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సభను భారీ ఎత్తున నిర్వహిస్తుండడంతో చంద్రబాబు, పవన్ పాల్గొనాలని నిర్ణయించారు. అయితే మొదట ఈ సభకు హాజరుకాలేనని పవన్ సమాచారం ఇచ్చారు. చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం పవన్ తానూ సభకు హాజరవుతానని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం పవన్ విజయనగరం చేరుకోవాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు చేరుకున్నారు. ఈ సభ ద్వారా ఇద్దరు నేతలు కీలక ప్రకటన చేస్తారని ఇరు పార్టీల క్యాడర్ భావించారు.

    ఈ సభలో టీడీపీ, జనసేన పొత్తు అవసరం, సీట్ల పంపకం, రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం వంటి వివిధ అంశాలను సభలో ప్రస్తావించి కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. పొత్తుతోనే వైసీపీని ఎదుర్కొని అధికారంలోకి రావచ్చని భరోసా కల్పించనున్నారు. అలాగే సీట్లు రాని నేతలు నిరుత్సాహపడవద్దని, పార్టీ అధికారంలోకి రావాలంటే కొంత త్యాగం చేయాల్సి ఉంటుందని నచ్చజెప్పనున్నారు. సీట్లు రాని వారి భవిష్యత్ కు భరోసా కల్పిస్తామని ప్రకటించనున్నారు. అలాగే వైసీపీకి, జగన్ పై సమర శంఖం పూరించనున్నారు.

    తాజాగా పవన్ హాజరుపై సందిగ్దత నెలకొంది. పవన్ జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం విమానంలో విశాఖకు వెళ్లి.. అక్కడి నుంచి విజయనగరం సభకు చేరుకోవాల్సి ఉంది. కానీ, ఆరోగ్య కారణాలతో పవన్ హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

    అయితే పవన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో పవన్ హాజరవుతారా? కారా? అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. టీడీపీ నేతలు మాత్రం పవన్ తప్పక హాజరవుతారని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....