21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Pawan old song : ‘బ్రో’ మూవీలో పవన్ పాత పాట.. ఈ సాంగ్ రీమిక్స్ చేస్తే ఇక థియేటర్స్ బద్దలే!

    Date:

    Pawan old song
    Pawan old song, bro

    Pawan old song : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలే ఎక్కువ అన్న విషయం తెలిసిందే.. అందులో పవర్ స్టార్ ఒకరు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.. మెగా హీరోల్లో ఒకరైన పవన్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.. అయితే మెగా ఫ్యామిలీ నుండి మల్టీస్టారర్ చేస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఆశ పడుతుంటారు..

    మరి ఫ్యాన్స్ ఆశలను నిజం చేస్తూ తాజాగా ఒక మెగా మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఒక సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు.

    సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వినోదయ సీతం అనే రీమేక్ సినిమా అనే విషయం తెలిసిందే.. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసుకుని న్న ఈ సినిమా అప్పుడే పూర్తి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ అండ్ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్ గా పవర్ స్టార్ సరికొత్త ట్రెండ్ సృష్టించాడు..

    ఇక ఆ తర్వాత సాయి తేజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే పవన్ – తేజ్ కలిసి ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేసి ఈ సినిమాపై ఆసక్తి పెంచేశారు.. ఇక తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న ఒక రూమర్ మరింత హైప్ పెంచేస్తుంది. అది ఏంటంటే.. గతంలో పవన్ నటించిన గుడుంబా శంకర్ సినిమా లోని కిళ్లీ కిళ్లీ అనే సాంగ్ కు రీమిక్స్ ను థమన్ బ్రో సినిమాలో రెడీ చేస్తున్నాడట.. ఈ సాంగ్ లో దిశా పటానీ కానీ శృతి హాసన్ కానీ డ్యాన్స్ చేసే అవకాశం ఉన్నట్టు టాక్..

    అంతేకాదు పవన్, సాయి తేజ్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు కూడా వేయనున్నారట.. ఇదే నిజమైతే థియేటర్స్ బద్దలవ్వడం ఖాయం.. ఇక ఈ సినిమాను జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT : ఈ వారం ఓటిటీలో రిలీజ్ కానున్న క్రేజీ మూవీస్ ఏంటో తెలుసా.. లిస్ట్ పెద్దదే!

    OTT ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమా...

    BRO : బ్రో నెల తిరగకుండానే ఓటీటీలోకి.. షాకవుతున్న అభిమానులు

    BRO : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్...

    BRO : భారీ నష్టాలే మిగిల్చిన బ్రో

    BRO : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా...

    BRO : బ్రో సినిమాపై మాట్లాడకండి.. అది కేవలం మూవీ మాత్రమే.. వివాదంపై తేల్చిచెప్పిన పవన్!

    BRO :  గత కొద్దీ రోజులుగా 'బ్రో' వివాదం సాగుతూనే ఉంది.....