
Minister Komatireddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు కచ్చితంగా గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు మంత్రి విమర్శించారు.
వాళ్లది ఒక పెద్ద ట్యాపింగ్ ఫ్యామిలీ అని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ చేసిన పాపాలకు రాష్ట్రంలో వర్షాలు పడడం లేదని మంత్రి ఆరోపించారు. హరీష్ రావు మాటలకు అర్దం లేదని దుయ్యబ్టారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు రోజుకొకరు కేసులో ఇరుక్కోవడంతో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత పెద్ద వారు ఉన్న బయకు రావడం ఖాయం అన్నారు.