34.6 C
India
Sunday, April 28, 2024
More

    Rajagopal Reddy : సొంత గూటికి రాజగోపాల్ రెడ్డి.. ఎల్లుండి ఢిల్లీలో చేరిక

    Date:

    Rajagopal Reddy
    Rajagopal Reddy

    Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి రాజీమానా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. చాలా సార్లు ఈ ఎన్నికను వ్యతిరేకించాడు. పార్టీలో సీనియర్ నేతలు ఉండగా వలస వచ్చిన నాయకుడికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంపై గొడవకు దిగాడు. ఆ తర్వాత కాంగ్రెస్ లో ఉండలేక బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఆయన మునుగోడుకు ఎమ్మెల్యేగా ఉన్నారు.

    కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఊపుమీదున్న బీజేపీలో చేరిన ఆయన స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు రాజగోపాల్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బండిని పక్కన పెడితే పార్టీని పవర్ లోకి తేవడం అసాధ్యం అంటూ చెప్పారు.

    ఇవన్నీ కొనసాగుతున్న సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం.. తెలంగాణలో ఊపుమీదకు రావడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాజగోపాల్ రెడ్డి అన్నతో చాలా సార్లు సంప్రదింపులు చేశారు. పార్టీ అధిష్టానం కూడా ఆయనను ఆహ్వానించడంతో కాంగ్రెస్ లోకి వెళ్తారన్న లీకులు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు (అక్టోబర్ 25) బీజేపీకి రాజీనామా చేశారు. ఎల్లుండి (శనివారం) ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయం కాంగ్రెస్ మాత్రమే అని ఆయన చెప్పారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న ఆయన బీజేపీ బీఆర్ఎస్ ను ఎదుర్కోలేదని చెప్పుకచ్చారు.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి..

    CM Revanth :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైనమ య్యా...

    Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ..!

    Telangana Congress : మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం...

    Revanth-Sharmila : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వైఎస్ షర్మిల.. భేటీ వెనుక మాస్టర్ ప్లాన్..?

    Sharmila-Revanth : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల...

    Congress New Strategy : కాంగ్రెస్ సరికొత్త వ్యూహం?

    Congress New Strategy : ఏపీలో రోజురోజుకి రాజకీయాలు మారుతున్నాయి. నిన్నటి...