Maheshbabu birthday టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఏ సినిమా చేసిన సంచలనమే అని చెప్పాలి.. ఇక ఇప్పుడు ఈయన టాలీవుడ్ లో మరో మోస్ట్ ఏవైటెడ్ కాంబోను సెట్ చేసాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో క్రేజీ కాంబోను సెట్ చేసుకున్నాడు. ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సరికొత్తగా మూవీ తీయబోతున్నాడు.
అందుకే ఈ సినిమా విషయం ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఉన్నారు. ప్రజెంట్ జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ స్క్రిప్ట్ వర్క్ తోనే బిజీ బిజీగా గడుపుతున్నాడు. యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది.. ఈ డిసెంబర్ నుండి మహేష్ కూడా ఈ సినిమా కోసం అన్ని విధాలుగా తనని తాను మార్చుకో బోతున్నాడు.
ఇదిలా ఉండగా అతి త్వరలోనే మహేష్ బాబు పుట్టిన రోజు రాబోతుంది.. మరి బర్త్ డే దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజమౌళి ఏం ప్లాన్ చేశాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా నుండి ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు కానుకగా గ్రాండ్ అనౌన్స్ మెంట్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు అని సమాచారం..
ఆ రోజు సూపర్ స్టార్ ను ఇంత వరకు చూడని కాన్సెప్ట్ తో పోస్టర్ ను కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు అని వార్తలు అందుతున్నాయి.. సాధారణంగా రాజమౌళి తన నటీనటుల పుట్టిన రోజు నాడు ప్రత్యేకంగా ప్లాన్ చేయడం సహజమే.. మరి మహేష్ కోసం కూడా జక్కన్న కొత్తగా వినూత్నంగా ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని అంతా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.