రవితేజ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలను ఎదుర్కొన్నాడు. చిత్ర పరిశ్రమలో మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఎంతో మంది దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్ గా చాలా సినిమాలకు పని చేశాడు. దర్శకుడు రాఘవేంద్ర రావు, ఈవీవీ సత్యనారాయణ, కృష్ణ వంశీ లాంటి ప్రముఖుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాకి కూడా రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. చాలా మందికి ఈ సంగతి తెలియదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ ఈ మూవీకి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఆకట్టుకోకున్నా.. పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం మంచి మార్కలే పడ్డాయి. ఈ మూవీకే రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కి చాలా సన్నివేశాలు ఆయనే వివరించాడు.
అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ చాలా రోజుల తర్వాత రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేయడం ప్రారంభించాడు. ఇలా యాక్టింగ్ లో కెరీర్ ను మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం మాస్ మహరాజ్ గా పాతుకుపోయాడు. హీరోగా బ్రేక్ రావడానికి చాలా కష్టపడ్డాడు.
ReplyForward
|