34.6 C
India
Sunday, April 28, 2024
More

    Jana Sena : జనసేన సంచలన నిర్ణయం.. అక్కడ అభ్యర్థుల ఖరారు..

    Date:

    Jana Sena :
    ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల లిస్ట్ లు రెడీ చేస్తున్నాయి. అధికార వైసీపీ దాదాపు సిట్టింగులకే అవకాశమిస్తుందనే టాక్ నడుస్తున్నది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో ముందుకెళ్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ, మరికొందరిని ప్రకటిస్తూ ముందుకెళ్తున్నది. జనసేన అద్భుతమైన ఎత్తుగడ వేసింది.
    ఓ వైపు టీడీపీ సత్తెన పల్లి, నెల్లూర్, విజయవాడ సెంట్రల్ అభ్యర్థులను ఖరారు చేసింది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే పొత్తులు ఇంకా ఖరారు కాకముందే ఇది కాక రేపింది. ఇక జనసేన కూడా రంగంలోకి దిగింది. తమ అభ్యర్థులను కొన్ని నియోజకవర్గాల్లో ప్రకటించేసింది. ఇన్చార్జిలుగా నియమించడం ద్వారా దాదాపు వారి పేర్లనే ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు.

    ఇందులో పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.. రాజనగరం నియోజకవర్గానికి బొత్తుల రామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గానికి పీరామారావు పేరును ఖరారు చేసింది. ఈ మూడు నియోజకవర్గాలు చాలా కీలకమైనవే. గెలవడానికి అవకాశాలు ఉన్ని నియోజకవర్గాలు ఇవి.

    పొత్తు ఉన్నా లేకున్నా ఇవి గెలుస్తాయని చెబుతున్నారు. ఇందులో కొవ్వురు నియోజకవర్గ ఇన్చార్జి రామారావు గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన అప్పుడు టీడీపీ నుంచి గెలిచారు. వైఎస్ ముఖ్యమంత్రి గా  ఉన్న సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు.
    ఆయన నిర్వహిస్తున్న బీ ఫార్మసీ కాలేజీలో ఒక సంఘటనను సృష్టించి వైఎస్ ప్రభుత్వం రామారావును ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. జైలుకు కూడా పంపింది. ఒక దళిత ఎమ్మెల్యేను ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదంటూ నాడు దళిత సంఘాలు పెద్ద ఉద్యమానికి దిగాయి. ఆ తర్వాత రామారావు ఆరోగ్యం కూడా ఒకానొక దశలో దెబ్బతింది.
    రామారావు పై నాటి వైఎస్ సొంత మీడియా పెద్ద ఎత్తున విష ప్రచారం చేసింది. ఈ విషయంలో టీడీపీ అనుకున్నంత స్థాయిలో పోరాడ లేదు. దీంతో తర్వాత ఎన్నికల సమయంలో ఆయన పార్టీని వీడారు. జనసేనలో చేరారు.

    అయితే పొత్తులంటూనే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమేనా అనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఇప్పటికైతే టీడీపీ ప్రకటించిన చోట జనసేన ఇంకా తన అభ్యర్థులను ఖరారు చేయలేదు.

    పొత్తుల విషయంలో తమకంటూ ఒక ప్రణాళిక ఉందని ఇరు వర్గాలు చెబుతున్నాయి. జనసేన కు ఇచ్చే సీట్ల విషయంలో ఇప్పటికే అధినేతల మధ్య ఒక  అవగాహన ఉందని, అందుకే వ్యూహం ప్రకారమే ఇరు పార్టీలు ముందుకెళ్తున్నాయనే చర్చ జరుగుతున్నది.
    ఏదేమైనా రెండు పార్టీలు స్నేహపూర్వకంగా ముందుకెళ్తే ఎలాంటి ఇబ్బందులు రావు. ఆఖరి నిమిషంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మొదటికే ముప్పు వస్తుంది. ఏపార్టీకి చిన్న నష్టం జరిగినా ఇబ్బందులు తప్పవు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికైతే అచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన ఒక ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తున్నారు.
    జగన్ ను దెబ్బతీసేందుకు ఆయన మరికొన్ని ఆస్ర్తాలు రానున్న రోజుల్లో బయటకు తీస్తారని టాక్ నడుస్తున్నది. మరి అవి ఏంటో అనేది ఇప్పటికైతే సస్పెన్స్. ఇక ఇరు పార్టీలు ఎన్నికల వరకు ఇలాగే ఒక వ్యూహంతో కలిసి నడిస్తే మాత్రం జగన్ కు ఇబ్బంది తప్పదు. ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఏమవుతుందో చూద్దాం మరి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhashyam Praveen :‘భాష్యం ప్రవీణ్’ గెలుపు కోసం ఏకమైన నేతలు

    మూడు పార్టీల నేతలు, ఇన్ చార్జీలు భాష్యం గెలుపు కోసం పనిచేస్తామని.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రచార పర్వలోకి దూకారు.

    Vijayawada West : విజయవాడ పశ్చిమ టీడీపీలో ఆసక్తికర పరిణామం

    Vijayawada West : విజయవాడ వెస్ట్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ...

    Political Lions Club Analysis : ఏపీలో టీడీపీ+జనసేన కూటమిదే జయం.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే?

    Political Lions Club Analysis : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో...

    Jana Sena in Telangana : తెలంగాణ బరిలో జనసేన.. గతంలో వచ్చిన ఓట్లెన్నో తెలుసా..

    Jana Sena in Telangana : తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన...