33.4 C
India
Friday, May 3, 2024
More

    Y. S. Sharmila : ఏపీకి వెళ్లేందుకు షర్మిల నో.. ఇక కాంగ్రెస్ లో విలీనం లేనట్లేనా..?

    Date:

    sharmila
    sharmila

    Y. S. Sharmila : వైఎస్సార్టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. దీనికి అనుకూలంగానే షర్మిలతో పాటు కాంగ్రెస్ నాయకుల అడుగులు పడ్డాయి. అయితే ఆమె సేవలను ఏపీకి పరిమితం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కోరారు. అధిష్టానం కూడా షర్మిల సేవలను ఏపీలో వాడుకోవడం ద్వారా, తిరిగి కాంగ్రెస్ జవసత్వాలు తేవాలని భావించింది. అయితే ఏపీలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నందున అక్కడి రాజకీయాల్లో తాను వేలు పెట్టలేనని షర్మిల చెబుతున్నట్లు సమాచారం.

    అయితే పోయిన చోటే వెతుక్కోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. కాంగ్రెస్ శ్రేణులను తన వైపు లాగేసుకున్న జగన్ ను దెబ్బకొట్టాలంటే షర్మిలను వాడుకోవాలని చూస్తున్నది. అయితే షర్మిల మాత్రం ఇందుకు సమ్మతించడం లేదు. ఏపీ పీసీసీ చీఫ్ ఇస్తామని హామీనిచ్చినా  అందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇక విలీనం అంశం తేలకపోవడంతో, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి షర్మిల యాక్టివ్ అయ్యారు. ఇటీవల ఎల్బీనగర్, గజ్వేల్ పర్యటనలంటూ హడావుడి చేశారు.

    అయితే షర్మిల పర్యటనను అనవసరంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నదనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఆమెకు లేని అవకాశాలను బీఆర్ఎస్సే కలిపిస్తున్నదనే అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. అయితే ఇది వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందమని కాంగ్రెస్ లో ఓవర్గం వాదన. ఏపీలో అన్నకు సీఎం కేసీఆర్ సహకరిస్తున్నందున ఇక్కడ బీఆర్ఎస్ కు అండగా నిలిచేందుకు షర్మిల ఈ రాజకీయాలు చేస్తున్నదని అనుమానిస్తున్నారు. ఏదేమైనా షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఇక లేనట్లే అని అర్థమైంది. ఇన్నాళ్లు డీకే శివకుమార్ ద్వారా మంతనాలు జరిపినా, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక షర్మిల తన దారి తాను చూసుకున్నట్లు కనిపిస్తున్నది.  మరి ఇప్పుడు తెలంగాణలో బరిలోకి దిగి, అభ్యర్థులను నిలబెడితే ఓట్ల చీలిక ఏ పార్టీకి మేలు చేస్తుందో తెలియనది కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ పైనే దీని ప్రభావం ఉంటుందనే టాక్ వినిపిస్తున్నది. మరి ఇది బీఆర్ఎస్ కు లాభం చేకూరుస్తుంది. మరి రానున్న రోజుల్లో షర్మిల తో కాంగ్రెస్ ఏమైనా చర్చలు జరుపుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    AP Inter Results : ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

    AP Inter Results : ఫస్ట్ ఇయర్ లో 67.. సెకండ్ ఇయర్...

    Mudragada : పిరికితనంతోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు..

    Mudragada : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ...

    Bhashyam Praveen : ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న..పెదకూరపాడు టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్..

    Bhashyam Praveen :  పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలోని...