Shraddha Das :
ముంబై భామ శ్రద్ధాదాస్. నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెరంగేట్రం చేసింది. తరువాత డైరీ, అధినేత చిత్రాల్లో హీరోయిన్ గా చేసినా అవి ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ కే పరిమితమైంది. ఆర్య2లో కూడా నటించినా ఆ సినిమా కూడా ఆమెకు అంత పేరు తీసుకురాలేదు. ఆర్య2లో అల్లు అర్జున్ అంటే ఇష్టమున్న పాత్ర చేసినా యావరేజ్ గా నిలవడంతో ఆమెకు క్రెడిట్ దక్కలేదు.
ప్రస్తుతం శ్రద్ధాదాస్ బిగ్ బాస్ షోలో పాల్గొంటోందని ప్రచారం జరిగింది. షోలోకి వెళ్తుందని అందరు అనుకున్నారు కానీ అవి వట్టి పుకార్లేనని చెబుతోంది. బిగ్ బాస్ షోకు వెళ్లే అవసరం నాకు లేదని కుండ బద్దలు కొట్టింది. దీంతో బిగ్ బాస్ షోకు వెళ్లడం అంతా వట్టిదేనని తేలిపో యింది. ఈ క్రమంలో సినిమాల్లోనే బిజీగా ఉండటం వల్ల బిగ్ బాస్ షోకు వెళ్లడం కుదరడం లేదని అంటోంది.
సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోల ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూనే ఉంటుంది. తాజాగా తన పరువాలు పంచుతూ పెడుతున్న పోస్టులకు విపరీతమైన క్రేజీ వస్తోంది. సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ గా నిలుస్తోంది. శ్రద్ధా దాస్ తెలుగులో ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటోంది. తన అందంతో పలకరిస్తూనే ఉంది.
ఏక్ మినీ కథ చిత్రంలో బోల్డ్ గా నటించి అందరిని పరేషాన్ చేస్తోంది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. శ్రద్ధాదాస్ ప్రస్తుతం తెలుగుతోపాటు ఇతర సినిమాలతో బిజీగా ఉంటోంది. పలు టీవీ షోలకు జడ్జీగా కూడా అప్పుడప్పుడు వస్తోంది. ఇలా తెలుగు వారికి నిత్యం పలకరిస్తూనే ఉంటుంది. పలు షో ల ద్వారా ఎప్పుడు అందుబాటులోకి రావడం గమనార్హం. బీచ్ లో తన అందాలు ప్రదర్శిస్తూ పెట్టిన ఫొటోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.