Sai Dharam Tej :
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అతిపెద్ద యాక్సిడెంట్ కు గురై ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన మళ్లీ సూసైడ్ కు యత్నించినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. చావు అంచు వరకూ వెళ్లి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇలా చేశాడేంటి అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు గుప్పుమన్నాయి. ఇదంతా నిజం అనుకుంటున్నారా? కాదులెండి రియల్ లైఫ్ కాదు రీల్ లైఫ్ లో నట. ఇంటిలో సమస్యలు.. ప్రేమ విఫలం ఇలా అనేక సమస్యలతో ఉరి వేసుకుంటున్నట్లు ‘బ్రో: ది అవతార్’ టీజర్ లో చూపించారు.
మెగా మేనల్లుడితో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా బ్రో: ది అవతార్. ఈ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘వినోదయా సీతం’ రీమేక్. అందులో దర్శకత్వం వహించిన సముద్రఖని రీమేక్ కు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఇందులో స్టయిలిష్ గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు వ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.
మెగా కుటుంబంలోని మేనల్లుడు, మామను ఒకే స్క్రీన్ పై చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆశ ఈ సినిమాతో తీరనుంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక సాంగ్ ‘మై డియర్ మార్కండేయ’ రిలీజై భారీ వ్యూవ్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీలోని లాస్ట్ సీన్ లో హీరో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకోబోతున్నాడట. ఇంటి సమస్యలు.. లవ్ ఫెయిల్యూర్ తట్టుకోలేకనే సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడట. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా వచ్చి కథను మలుపు తిప్పుతాడని తెలిసింది. ఈ సినిమాతో పవన్ కళ్యాన్ యంగ్ జనరేషన్ కు మెసేజ్ ఇవ్వబోతున్నాడట. క్లైమాక్స్ సీన్ హార్ట్ టచ్చింగ్ ఉంటుందని చిత్ర బృందం చెప్తుంది. సుప్రీం హీరో సూసైడ్ సీన్ చూసి పవన్ కూడా షూటింగ్ సమయంలో ఏడ్చాడని వార్త కూడా వైరల్ అవుతోంది.