Tamanna’s sensational comments : టాప్ హీరోయిన్ లలో తమన్నా ఒకరిగా ఉన్నారు. ఈమె ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది అనే చెప్పాలి.. ఎందుకంటే ఆమె నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ తో ఈమె సంచలనం క్రియేట్ చేసింది. ఈమె తన లవర్ విజయ్ వర్మతో కలిసి మొదటిసారి లస్ట్ స్టోరీస్ 2 అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించింది.
ఇది జూన్ 29 నుండే స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సందర్భంగా తమన్నా, విజయ్ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. మొదటి సీజన్ ను మించి రెండవ పార్ట్ లో మరింత ఎక్కువ బోల్డ్ సీన్స్ ఉన్నాయి.. తమన్నా ఇలాంటి బోల్డ్ సిరీస్ లో నటించడంతో అంతా షాక్ అవుతున్నారు.
ఈ భామ ఏకంగా తన ప్రియుడు విజయ్ వర్మతో కల్సి లిప్ కిస్ లు కూడా పెట్టేసింది. దీంతో ఈ అమ్మడిని ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. తమన్నా ఇంత బోల్డ్ గా నటిస్తుంది అని ఆమె ఫ్యాన్స్ సైతం ఎక్స్పెక్ట్ చేయలేదు.. 18 ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడు చేయని పాత్రలను సైతం ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్ళగానే మొదలు పెట్టేసింది.
తన ప్రియుడు విజయ్ వర్మ కోసం రూల్స్ అన్నిటికి పక్కన పెట్టేసింది. ఇదిలా ఉండగా లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఈమె షాకింగ్ విషయాలను బయట పెడుతుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ముద్దు సీన్ కోసం అడిగారా అనే ప్రశ్న ఎదురు అయ్యింది.
ఇందుకు ఈ భామ అడిగారు అని టాలీవుడ్ లో ఒక సినిమాలో చేస్తున్నప్పుడు ఒక స్టార్ హీరో ముద్దు సీన్ కోసం అడిగారని.. నేను నో కిస్సింగ్ రూల్ పెట్టుకున్నాను అని చెప్పిన అతడు వినిపించుకోలేదు. డైరెక్టర్ కూడా కంటెంట్ కోసం కావాలి అని అనడంతో ఆ హీరో నన్ను పదే పదే అడిగి ఇబ్బంది పెట్టాడు అని నేను ఓకే అనక పోవడంతో వారు సైలెంట్ అయిపోయారు అంటూ సీక్రెట్ చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో ఎవరో ఈ భామ రివీల్ చేయలేదు.. .
ReplyForward
|