34.5 C
India
Monday, May 6, 2024
More

    Shankar Film : శంకర్ సినిమాను రిజెక్ట్ చేసిన మెగాస్టార్.. అయినా వదలలేదు ఏం చేశాడంటే?

    Date:

    Shankar Film
    Shankar Film, Game Changer

    Shankar Film : తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమా అంటే కేవలం వినోదమే కాదు.. అందులో గొప్ప సందేసం కూడా ఉండాలంటాడు శంకర్. అందుకే ఆయన చేసిన ప్రతీ సినిమాలో ఒక సందేశం ఉంటుంది. లవ్ జానర్ మూవీల్లో కూడా ఆయన మంచి సందేశం ఇస్తాడు.. అలాంటి శంకర్ తో సినిమా చేయాలని ప్రతీ స్టార్ హీరోకు ఉంటుంది. కానీ మన మెగాస్టార్ మాత్రం ఆ ఛాన్స్ ను వద్దనుకున్నాడట. అదెందుకో తెలుసుకుందాం.

    ఆయన ఫస్ట్ మూవీ జెంటిల్‌మన్ నుంచి నిన్నటి రోబో 2.0 వరకు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే.. 3 ఈడియట్స్ ను రీమేక్ చేసి స్నేహితుడు చేశాడు. ఇది బాలీవుడ్ కు మించి కలెక్షన్లను దక్కించుకుంది. ఇలా ప్రతీ సినిమాను ఎంతో భారీ హిట్ చేసేలా డిజైన్ చేస్తాడు. అయితే, జంటిల్‌మెన్ మూవీ మొదట మెగస్టార్ చిరంజీవితో కలిసి తీయాలని అనుకున్నాడట.

    ఆ సమయంలో చిరంజీవి మంచి ఫామ్ మీద ఉన్నాడు. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. జెంటిల్ మెన్ కథకు ఆయన మొదట ఓకే చెప్పారట. కానీ  అప్పటికే కొందండ రామిరెడ్డితో  సినిమా కమిట్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ కాలేకపోయాయట. ఆ తర్వాత రాజశేఖర్ తో సినిమా చేయాలనుకున్నా ఆయనకు కూడా ఇదే సమస్యతో ఎదురవడంతో రిజెక్ట్ చేశాడు. అర్జున్ కు కూడా మంచి ప్రాజెక్టులు చేతిలో ఉన్నా.. కథ నచ్చి డేట్స్ అడ్జస్ట్ చేశారట. ఆ తర్వాత రిలీజైన జెంటిల్ మెన్ బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించి అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచింది.

    శంకర్ కు మెగాస్టార్ అంటే బాగా ఇష్టమట. ఆయనతో సినిమా చేయాలన్న కోరిక నెరవేరలేదు. అయినా సరే ఆయన కొడుకు రామ్ చరణ్ తో సినిమా చేసి కొంతలో కొంత ఆయన కోరిక తీర్చుకున్నాడని టాలీవుడ్ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుందని మెగా అభిమానులు సైతం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ పై టీం ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

    సినిమాకు ఫస్ట్ లుక్ తప్ప గ్లింప్స్ గానీ , టీజర్ గానీ ఇప్పటి వరకు (జనవరి 20 నాటికి) రిలీజ్ కాలేదు. ఈ మూవీతో శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ గా తన స్టామినా నిరూపించుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ మూవీ థియేటర్ లోకి ఎప్పడు వస్తుందనే దానిపై క్లారిటీ లేకపోవడంతో మెగా అభిమానులు గందరగోళంలో ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    YS Sharmila : షర్మిల కొత్త ఆయుధాలు ఇవే.. గేమ్ ఛేంజర్ కానున్నాయా?

    YS Sharmila : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు దూకుడు...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...