World cup winner ఆస్ట్రేలియా మాజీ సీమర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వన్డే ప్రపంచ కప్ -2023 లో తన మొదటి నాలుగు జట్లను పేర్కొన్నాడు. టైటిల్ గెలుచుకునే ఫేవరెట జట్లలో ఆస్ట్రేలియా ఒకటి అని గ్లెన్ మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అయితే భారత్ కంటే పాకిస్తాన్ విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఆయా దేశాల విజ్ఞప్తి మేరకు ఒకటి రెండు మ్యాచ్‌ల తేదీలను మార్చే విషయమై బీసీసీఐ ఆలోచనలు చేస్తున్నది. ఇప్పటికే జట్లన్నీ ప్రపంచకప్ కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లెన్ మెక్‌గ్రాత్ మెగా టోర్నీ ఫేవరేట్ టీమ్స్ వివరాలను వెల్లడించాడు. స్వదేశంలో వరల్డ్ కప్ జరగడం భారత్‌కు అనుకూలతలు ఎక్కువ. ప్రత్యర్థులకు కూడా పెద్దగా ఇబ్బంది ఏం ఉండదు. ఐపీఎల్ మ్యాచ్ లతో ఇక్కడి పిచ్‌లపై ప్లేయర్లకు పూర్తి అవగాహన ఉంది. ఐపీఎల్ మ్యాచ్ లలో ఆడిన అనుభవంతో భారత్ ఆడేందుకు మిగతా జట్లకు అంతగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఎక్కువగా ఆడుతున్నారు. ఈ అనుభవం వారికి ప్రపంచకప్ టోర్నీకి కలిసి రానుంది.
ప్రపంచకప్ గెలిచే ఫెవరరేట్లతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కచ్చితంగా ఉంటాయని చెప్పాడు. అన్నింటికీ మించి పాకిస్థాన్‌కు ఈసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్, పేస్ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఫీల్డింగ్‌లో పాకిస్థాన్ మరింత మెరుగుపడాలి.
భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు వరల్డ్ కప్ టోర్నీలో ఫేవరేట్స్. భారత్‌లో పేసర్లకు పెద్దగా సహకారం లభించకపోవచ్చు. ఇక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు ప్రత్యేకం. అయితే టీమిండియా నుంచి చాలా మంది యువ పేస్ బౌలర్లు వస్తున్నారు. ఇంతకుముందు టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు వారి ఆలోచన మారింది. భారత్‌లో ఫాస్ట్ బౌలర్‌గా సక్సెస్ అయితే.. ప్రపంచంలో ఏ దేశంలో అయినా వికెట్లు తీయవచ్చు.’అని గ్లేన్ మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు.