Rich మనలో చాలా మంది ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. ఎంత సంపాదించినా ఖర్చయిపోతుందని దిగులు చెందుతుంటారు. బుధవారం రోజు ఈ పని చేస్తే దారిద్ర్యం తొలగిపోయి మంచి పొజిషన్ వస్తుంది. బుధవార ఏం చేయాలో తెలుసుకుని ఆ పరిహారాలు చేస్తే మనకు ఏ లోటు ఉండకుండా ఉంటుంది. దారిద్ర్యం రాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసకోవాలి.
ఒక్కో రోజు
హిందూ ధర్మం ప్రకారం రోజుకో దేవుడిని కొలవడం ఆచారం. సోమవారం శివుడిని, మంగళవారం ఆంజనేయుడికి, బుధవారం గణపతికి, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఆదివారం సూర్య భగవానుడికి పూజలు చేయడం గమనార్హం. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
వాస్తు దోషాలు
ఇంటికి వాస్తు దోషాలు ఉన్నట్లయితే పలు సమస్యలు వస్తాయి. ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. గణపతి విగ్రహాలను వెనుక భాగంలో ఉండేలా లేదా ముఖ ద్వారం దగ్గర ఏర్పాటు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు పోయి మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే బుధవారం రోజు 21 లేదా 42 జూపత్రి ఆకులతో గణపతికి పూజ చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మన ఆర్థిక కష్టాలు తీరుతాయి. బుధవారం రోజు ఆవుకు గడ్డి వేస్తే దోషాలు ఉండవు. పనుల్లో పురోగతి వస్తుంది. మనం చేసే పనుల్లో విజయం సాధిస్తుంటారు. వాస్తు రీత్యా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం మంచిది.