31.9 C
India
Monday, May 6, 2024
More

    Delhi payroll cheating : పనిచేయని తన భార్యకు కోట్లలో జీతం.. ఈ దొంగ మేనేజర్ దోచుకున్నాడు

    Date:

    froad
    froad
    Delhi payroll cheating మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ చేసిన నిర్వాకానికి కంపెనీ యాజమాన్యం నోరెళ్లబెట్టింది. కంపెనీ హెచ్ఆర్ కావడంతో ఎటువంటి ఉద్యోగం లేని తన భార్యకు తాను పనిచేస్తోన్న కంపెనీ నుంచి జీతం వచ్చేలా చేసి పదేళ్లలో నాలుగు కోట్ల కంపెనీ సొమ్మును కొల్లగొట్టారు.
    ఢిల్లీకి చెందిన మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండడంతో మోసం బయటపడటానికి చాలా సమయం పట్టింది. కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నిరుద్యోగియైన తన భార్య పేరును కంపెనీ పే రోల్ లో చేర్చాడు. దీంతో ఆమెకు కూడా కంపెనీలోని మిగతా ఉద్యోగుల్లాగానే నెలవారీ జీతం అకౌంట్లో జమయ్యింది.
    కంపెనీకి వెండర్ కు మధ్య వారధిలా ఉండే హెచ్ఆర్ ఫైనాన్స్ మేనేజర్ పాత్రలో రాధా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ తంతు మొత్తాన్ని జాగ్రత్తగా నడిపించాడు.
    ముందుగా ఉద్యోగుల జీతభత్యాల వివరాల్లో తన భార్య పేరును ఎక్సెల్ షీటులో చేర్చి వెండర్ కు పంపేవాడు. వెండర్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను పైపైన చూసి సంతకం చేసి తిరిగి పంపేవాడు. అటుపై ఈ ఫైలును రాధా తన డైరెక్టర్ కు, ఆయన ఆమోదించిన తర్వాత చివరిగా చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారికి పంపి ఆఖర్లో తాను సంతకం చేసి అకౌంట్స్ కు పంపేవాడు. అకౌంట్స్ వారు అలాగే జీతాలు చెల్లించేవారు.
    ఇలా పదేళ్ల పాటు సాగిన దందాలో కంపెనీకి సుమారు రూ.4 కోట్లు వరకు నష్టం వాటిల్లింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడడంతో కంపెనీ యాజమాన్యం నివ్వెరపోయింది. రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి విస్తుపోయిన కంపెనీ వెంటనే పోలీసు కంప్లైంటు ఇచ్చి అతడిని కటకటాల వెనక్కు పంపించారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Unemployed Youth : పరీక్షల పేరుతో నిరుద్యోగుల సొమ్మును కేసీఆర్ సర్కార్ ఎంత తీసుకుందో తెలుసా?

    Unemployed Youth : తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. అధికార బీఆర్ఎస్,...

    Job Notifications : నిరుద్యోగులకు నోటిఫికేషన్లు.. ఎన్నికల వేళ ఏపీ సర్కారు ఓట్లస్త్రం

    Job Notifications : ఏపీలో నిరుద్యోగులకు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇన్నాళ్లు...

    100 Crores Fraud : వంద కోట్ల మోసం.. బాధితుడు వైసీపీ నేత అంటూ ప్రచారం

    100 Crores Fraud : కృష్ణా జిల్లాలో ఘరానా మోసం బట్టబయలైంది. జిల్లాలో...

    Khiladi lady : ముసలి వారిని వదిలిపెట్టని ఖిలాడీ లేడీ

    Khiladi lady : కామా తురానాం నభయం నలజ్జ అంటారు. కామంతో...