30.4 C
India
Tuesday, May 7, 2024
More

    Tollywood industry : టాలీవుడ్ ఇండస్ట్రీనా మజాకా..!

    Date:

    Tollywood industry
    Tollywood industry

    Tollywood industry : మార్పు సహజం.. అది ఏ రంగమైనా కావచ్చు. టాలీవుడ్ సినిమా రంగాన్ని పరిశీలిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్లను అందుకుంది. ఇప్పుడు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. మాద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడిన టాలీవుడ్ మూస ధోరణిని అవలంభించింది. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్ వాటిని కొంచెం మలుపు తిప్పారు. ఆ తరం తర్వాత వచ్చిన నాగార్జున, చిరంజీవి మరికొంత మలుపు తిప్పారు.

    హీరో, హీరోయిన్ ప్రేమ, త్యాగం ఈ కథలతోనే సాగే టాలీవుడ్ ఇండస్ట్రీని ‘శివ’తో మార్చి వేశారు రాంగోపాల్ వర్మ. అప్పటి నుంచి టాలీవుడ్ ను రెండుగా విభజించారు. శివకు ముందు శివ తర్వాత అని అంతలా ప్రభావం చూపింది ఆ సినిమా తర్వాత అలాంటి క్రెడిట్ నే బాహుబలి దక్కించుకుంది. ఇది మరో అడుగు ముందుకేసి టాలీవుడ్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసింది.

    ఇప్పుడు టాలీవుడ్ సవ్య దిశలో సాగుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవి ఒక్క టాలీవుడ్ నుంచే కాకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి ఇదే మాట వినిపిస్తుంది. బాహుబలి వరల్డ్ వైడ్ సెన్సేషన్. తర్వాత ఆర్ఆర్ఆర్ ఆస్కార్, ఇప్పుడు జాతీయ అవార్డుల్లో బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా.. ప్రతీ అవార్డుల ఫంక్షన్ లో టాలీవుడ్ టాక్ వినిపించకుండా పూర్తవడం లేదు.

    ఇక టాలీవుడ్ సెన్సేషనల్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ లాంటి పురస్కారలను దక్కించుకుంది. హాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లు, లెజండరీ నటుల హృదయాలను కూడా ఈ మూవీ గెలుచుకుంది. బాహుబ‌లి సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త దారులు వేశాయి.

    ఆర్ఆర్ఆర్ 6 జాతీయ అవార్డుల‌ను గెలుచుకోగా.. పుష్ప కూడా దానికి తోడై రెండు అవార్డుల‌ను గెలుచుకుంది. ఉప్పెన‌, కొండ‌పొలం లాంటి సినిమాలు ఒక్కో జాబితాలో అవార్డును తన ఖాతాలో వేసుకున్నాయి. టాలీవుడ్ లో అన్ని విభాగాల్లో మంచి ప్రతిభా వంతులు ఉన్నారని ఇప్పుడు ఇండియా మొత్తం తెలిసిపోయింది. ఏకంగా 10 జాతీయ స్థాయి అవార్డుల‌ను గెలుచుకుంది టాలీవుడ్. ఇది ముందు తరాలకు మరింత భరోసా కలిగిస్తుంది. జాతీయ స్థాయి మార్కెట్ లో జెండా పాతిన మన సినిమా హాలీవుడ్ వైపు గురిపెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని నుంచి భారీ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అందులో ‘కల్కి 2892 AD’, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా ప్రభాస్ నటిస్తున్నాడు. సలార్ ప్రశాంత్ నీల్-ప్రభాస్, పుష్ప2 సుకుమార్-అల్లు అర్జున్, గేమ్ ఛేంజర్ శంకర్-రాం చరణ్, ఇక ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయిలో ఒక సినిమా రాబోతోంది. ఇవన్నీ టాలీవుడ్ అంచనాలను రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నాయి.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...