తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మారడంతో లండన్ లో BRS జెండా ఆవిష్కరించారు లండన్ లో స్థిరపడిన తెలంగావాదులు. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ కు మేము అండగా ఉన్నామని , తెలంగాణ కోసం సుదీర్ఘ కాలం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని , ఇక ఇప్పుడు భారతదేశంలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ నడుం కట్టారని , ఇప్పుడు కూడా కేసీఆర్ వెంట నడుస్తామని భారతదేశం ఉజ్వల భవిష్యత్ కోసం భారత్ రాష్ట్ర సమితి నాయకులుగా కష్టపడతామని స్పష్టం చేసారు BRS UK అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి.
TRS- BRS గా మారిన ఈ సమయంలో లండన్ లోని టవర్ బ్రిడ్జి వద్ద BRS జెండా ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని , లండన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో త్వరలోనే కమిటీలు వేస్తామని , కేసీఆర్ కు అండగా నిలుస్తామని …… ఎన్నారై లంతా కేసీఆర్ వెంట నడుస్తామన్నారు అశోక్ గౌడ్. ఈ కార్యక్రమంలో చందు గౌడ్ , నవీన్ రెడ్డి , హరి గౌడ్ , సత్య చిలుముల , శ్రీకాంత్ జెల్ల , సతీష్ గొట్టెముక్కల , రవి ప్రదీప్ , రవి రేతనేని , నవీన్ , అబ్దుల్ జాఫర్ , పృథ్వీ , మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.