40.8 C
India
Sunday, April 28, 2024
More

    USA President : ఢీకొన్న కార్లు.. నడిరోడ్డుపై నిలబడిపోయిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

    Date:

    USA President
    USA President

    USA President : అత్యంత శక్తివంతమైన దేశం ఏదంటే టక్కున చెప్పే పేరు అమెరికా. అలాంటి దేశ అధ్యక్షుడే 30 నిమిషాల పాటు రోడ్డుపై నిల్చున్నాడు. ఈ ఘటన ఒక్క అమెరికానే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాన్వాన్ లో తలెత్తిన భద్రతా లోపంతో దేశ అధ్యక్షుడు, ఆయన సతీమణి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఏం జరిగిందంటే..

    అమెరికా కాలమానం ప్రకారం..  డెలవార్ లోని విల్లింగ్టన్ లో ఆదివారం (డిసెంబర్ 17) 8.09 గంటలకు ప్రమాదం జరిగింది. బైడెన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఒక ఫోర్డ్ కారు ఈ కాన్వాయ్ ని వెంబడించింది. వేగంగా వచ్చి కాన్వాయ్ లోని కారును ఢీ కొట్టింది. ఈ హఠాత్ పరిణామంతో సెక్యూరిటీ సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే ప్రమాద ఘటనకు చేరుకున్నారు.

    ఈ ప్రమాద ఘటనతో జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ కారు దిగారు. కొంత సేపు రోడ్డుపై నిలబడ్డారు. దీంతో పర్సనల్ సెక్రటరీలు మరో కారులో తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో బైడెన్ దంపతులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వైట్ హౌజ్ వర్గాలు వివరించాయి. ఈ మేరకు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జాన్ పియర్రె ఒక ప్రకటన రీలీజ్ చేశారు. వారిని మరో వాహనంలో సురక్షితంగా వైట్ హౌస్‌కు చేర్చారు.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలను భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు అనుమానిత ఘటనలు చోటు చేసుకోలేదని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ఏజెంట్ స్టీవ్ కొపెక్ చెప్పారు. ఆ ప్రాంతం మొత్తం తమ సర్వైలెన్స్‌లోకి తతీసుకన్న కొపెక్ వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Crime News : నిలిపి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

    Crime News : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

    Mahavir Ambition : మహావీర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది..

    Mahavir Ambition : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మహావీర్ జయంతి...

    Dharmapuri MLA : ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తా.. ఆస్పత్రికి తరలింపు. 

    Dharmapuri MLA Car Accident : ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే...

    Donald Trump : న్యూయార్క్ కోర్టులో ట్రంప్ కు 4  లక్షల డాలర్ల జరిమానా

    Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు...