
Virender Sehwag Comments on Adipurush : ఆదిపురుష్ సినిమా వివాదాలకే కేంద్రంగా నిలుస్తోంది. దీనిపై మాజీ టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. సినిమాను ఇష్టమొచ్చినట్లుగా ప్రయోగాలు చేసి తీశారు. రూ. 500 కోట్ల సినిమాలో కనీసం రూ. 50 కోట్ల న్యాయం కూడా చేయలేదని అన్నారు. బాహుబళి కట్టప్పను ఎందుకు చంపాడో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ట్విట్టర్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్ సరైన విధంగా తెరకెక్కించలేదనే వాదనలు వస్తున్నాయి. ఇప్పటికే నెగెటివ్ ముద్ర పడిన సినిమా విషయంలో అందరు విమర్శలు చేస్తున్నారు. రామాయణం అద్భుత కావ్యం దాని గురించి మంచి తీయకపోయినా ఫర్వాలేదు కానీ చెడు తీయొద్దని సూచించాడు. శక్తిమాన్ సీరియల్ ఫేమ్ ముఖేష్ రానా సినిమా టీంను ఎండలో నిలబెట్టి తగులబెట్టాలని కామెంట్ చేయడం గమనార్హం.
సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. రామాయణం మొత్తాన్ని కామెడీ చేశారనే విమర్శలు పెరుగుతున్నాయి. సినిమాను రద్దు చేయాలనే నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ అభ్యంతరం చెబుతున్నారు. మరోపక్క కొంతమంది నెటిజన్లు ట్వీట్లు ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా విషయంలో వస్తున్న విమర్శల నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ ను నిందిస్తున్నారు.
రామాయణం కథ కావడంతో ఆద్యంతం హృద్యంగా తెరకెక్కించాలని భావించినా అది బెడిసికొట్టింది. ప్రభాస్ ముందే హెచ్చరించాడు. ఏదో జరుగుతుందని జాగ్రత్త అని హెచ్చరించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా నెగెటివ్ టాక్ రావడం గమనార్హం. ఇప్పుడు రామాయణం ఆలోచన బెడిసి కొట్టడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు.