Whatsap Chating : వారిది ప్రేమవివాహం. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు. భార్యాభర్తల మధ్య నమ్మకం పునాది అనుమానం సమాధి అంటారు. అలా ఆలుమగల్లో ప్రేమ తగ్గితే అనుమానాలు రావడం సహజమే. ఈ నేపథ్యంలో వారి మధ్య అగాధం పెరిగింది. దీంతో భార్యను కడతేర్చాడు. వివాహ బంధానికి చరమగీతం పాడాడు.
కర్ణాటకలోని మండ్య (డి) మండ్య కొప్పళ్లులో జరిగింది. పూజ, శ్రీనాథ్ లది ప్రేమ వివాహం. వీరి కాపురానికి గుర్తుగా ఓ కుమార్తె కూడా ఉంది. కానీ కొన్నాళ్లుగా పూజ రీల్స్ చేయడానికి అలవాటు పడింది. ఇతరులతో చాటింగ్ చేయడం మొదలెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని శ్రీనాథ్ భార్య ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. దీంతో కోపం పెంచుకున్నాడు.
ఎలాగైనా పూజను చంపాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే పక్కా ప్రణాళిక ప్రకారం ఆమెను చంపాడు. రీల్స్ అలవాటును మార్చుకోని భార్యను కడతేర్చాడు. ఇదే సమయంలో ఆమెను చంపి నదిలో పడేశాడు. విషయం కాస్త బయటకు రావడంతో అతడిని అరెస్టు చేశారు. కట్టుకున్న భార్యను చంపిన నిందితుడిని అరెస్టు చేయడంతో కూతురు అనాథగా మారంది.
ఇటీవల కాలంలో మనుషుల ప్రవర్తన వింతగా ఉంటోంది. దీంతోనే వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పూజ ఇతరులతో చాటింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తుండేది. దీన్ని జీర్ణించుకోలేని భర్త వద్దని చెప్పినా వినలేదు. ఈ నేపథ్యంలో ఆమెను తుదముట్టించాలని అనుకుని అలా చేయడం విమర్శలకు తావిస్తోంది. పూజను చంపిన భర్త శ్రీనాథ్ పై అందరు శాపనార్థాలు పెట్టారు.