AP BJP : ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి బాగా లేదు. అక్కడ ఒక్క ఎమ్మెల్యే గానీ ఎంపీ సీటు గానీ లేకపోవడం గమనార్హం. కానీ రాష్ట్రంలో ప్రభావం చూపాలని యోచిస్తున్నా కుదరవడం లేదు. జనసేనతో పొత్తు పెట్టుకున్నా ఎన్నడు కూడా రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన సందర్భాలు లేవు. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీని కాదని ఒంటరిగా పోటీ చేసి ఓటమిని ఎదుర్కొంది.
దీంతో బీజేపీని కాదని ఏ పార్టీ కూడా రాజకీయం చేయలేదు. అందుకే బీజేపీతో పెట్టుకోవడం అంత మంచిది కాదని భావిస్తున్నాయి. వైసీపీ కూడా బీజేపీకి అన్ని సమయాల్లో అనుకూలంగానే ఉంటుంది. పార్లమెంట్ లో చాలా సార్లు బీజేపీకి మద్దతు ఇచ్చిన వైసీపీ తన పని తాను చేసుకుంటూ పోతోంది. వైసీపీ లోకల్ లీడర్లు అవాకులు చెవాకులు పేలుతున్నా జగన్ మాత్రం బీజేపీని పల్లెత్తు మాట అనరు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఏపీలో జరగబోయే ఎన్నికలకు ఇంకా పొత్తుల విషయం తేలలేదు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయో తెలియడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతుందని సమాచారం. దీంతో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
ఏపీలో పొత్తుల తీరుపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గత కొద్ది రోజులుగా జనసేన, టీడీపీ పొత్తుపై ముందుకు వెళ్లడంతో బీజేపీ వారితో కలుస్తుందో లేదో అనే సందేహాలు వస్తున్నాయి. టీడీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయడం లేదు. అందుకే జనసేన మద్దతు తీసుకుంటోంది. ఈనేపథ్యంలో బీజేపీ రహస్య స్నేహితుడి పాత్ర పోషిస్తుందా? లేక బహిరంగంగా మద్దతు తెలుపుతుందో చూడాల్సిందే.