
Girls Like : అమ్మాయిలను ప్రేమించేందుకు అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు. ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తారు. స్కెచ్ లు వేస్తారు. కానీ ఇవన్న వట్టివే. అమ్మాయిలను పడేయడం పెద్ద విద్యేమీ కాదు. చాలా సులభమనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో వారు ఏవేవో వెర్రి వేషాలు, పిచ్చి చేష్టలు, డ్రెస్సులు వేసుకుని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇవన్నీ దండగే. మన లైఫ్ స్టైలే వారిని మన దారికి వచ్చేలా చేస్తాయనే విషయం తెలియదు.
అబ్బాయిలు అమ్మాయిలు ఎలా పడతారని గూగుల్ లో కొట్టి మరీ వెతుకుతున్నారు. అబ్బాయిలు అందంగా లేకపోయినా పడతారు. కానీ వారికి ఏదో ఒక ఉద్యోగం, లక్ష్యం ఉండాలి. దీంతో వారి సిన్సియారిటీని ఇష్టపడతారు. తద్వారా తనను కూడా లైక్ చేస్తారు. అంతేకాని బేవాస్ గా తిరిగే వాడికి అమ్మాయిలు పడరు. కాబోయే భర్తలో కొన్ని లక్షణాలు చూసుకుంటారు అమ్మాయిలు.
శరీరం ఫిట్ గా ఉన్న వారిని కూడా ఇష్టపడతారు. అలాగే అబ్బాయిలు కూడా ఫిట్ గా ఉన్న అమ్మాయిలనే కావాలని అనుకుంటారట. బాడీ షేప్ బాగున్న వారిని బాగా ఇష్టపడతారట. జీవితంలో ఒక లక్ష్యం అంటూ పెట్టుకుంటే దాన్ని బాగా ఇష్టంగా చూస్తారు. అలాంటి వారి ఒళ్లో వచ్చి పడతారు. అందుకే ఊరికే తిరిగే వారికి అమ్మాయిలను పడేయడం కుదరదు.
బయట ఉద్యోగమే కాదు ఇంటి దగ్గర పనులు చేసే వారిని కూడా ఇష్టంగా చూస్తారు. ప్రతి పనిలో అబ్బాయిలను బాగా పరిశీలించాకే వారి మనసులోని విషయం చెబుతారు. అంతేకాని తొందరపాటుకు గురికారు. జీవిత భాగస్వామి అయ్యే లక్షణాలు ఉంటేనే వారికి యస్ చెబుతారు. లేకపోతే నో అనే సమాధానమే వస్తుంది. ఇలా అమ్మాయిలు అబ్బాయిల పాలిట పలు గుణాలు చూసుకుంటారు.
ఆత్మగౌరవం ఉన్న వారిని బాగా గౌరవిస్తారు. చేసే పనిలో హుంతాతనం చూస్తారు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో కూడా ఎన్నో విధాలుగా గమనిస్తారు. వారికి అనువైన వారినే ఎన్నుకుంటారు. ఆషామాషీగా ఉండే వారు కాదు అన్నింట్లో సరితూగే వారినే కోరుకుంటారు. వారినే తమ జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకుంటారు. ఇలా అమ్మాయిలు అబ్బాయిల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.